-అమరజీవికి ఘననివాళులు…
-త్యాగమూర్తిని స్మరించుకుందాం…
-జిల్లా కలెక్టర్ జె.నివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలర్పించి, బాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ జె. నివాస్ అన్నారు. స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం అమరజీవి పొట్టిశ్రీరాములు 121వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జె.నివాస్ పూలమాలవేసి ఘనంగా నివాళర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు మహాపురుషుడని పేర్కొన్నారు. తుదిశ్వాస వరకు ఆంధ్రజాతి ఐక్యత కోసం పోరాడారన్నారు. అమరాజీవిగా చరిత్ర కెక్కిన త్యాగమూర్తిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవం కోసం వారు చేసిన పోరాటం ప్రతి తెలుగు వారికి గర్వకారణం, స్పూర్తి దాయకమన్నారు.అమరాజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్మరించుకొని నేటి యువత దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో బిసి సంక్షేమ శాఖ డిప్యూటి డైరెక్టర్ లక్ష్మిదుర్గ పాల్గొన్నారు.