ఆచంట, నేటి పత్రిక ప్రజావార్త :
ఆచంట నియోజకవర్గం గృహ నిర్మాణ లబ్ధిదారులకు తక్కువ ధరతో సిమెంటు పంపిణీ చేసిన, ఆంధ్ర రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేదోడు గా నిలిచారు. సిమెంట్ బస్తా ధర 400 రూపాయలకు పైగా ఉండడంతో నియోజకవర్గంలో పేదవాని గృహ నిర్మాణం పై భారం పడకుండా 250 రూపాయల వంతున 50 బస్తాలను తూర్పుపాలెం క్యాంప్ ఆఫీసు వద్ద లబ్ధిదారులకు అందించడానికి గురువారం శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం తక్కువ ధరకు బేస్మెంట్ లెవల్లో 40 బస్తాలు , అనంతరం 60 బస్తాలు ఇవ్వడంతో మరికొన్ని బస్తాలు బహిరంగ మార్కెట్లో కొనవలసి పేదలకు భారం గా మారడంతో మంత్రి రంగనాథ రాజు సొంతంగా 250 రూపాయల కే లబ్ధిదారులకు అందించడంతో సర్వత్రా లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు, వీటితో పూర్తిగా లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పై భారం పడకుండా పూర్తి చేసే సౌలభ్యం కలిగింది. లబ్ధిదారుడి కి దాదాపుగా 10,000 రూపాయల కు పైగా భారం తగ్గుతుంది. దీంతోపాటు పునాదులలో గోదావరి నుంచి బొండు మట్టి తెచ్చుకునే సౌలభ్యం మంత్రి రంగనాధ రాజు కల్పించడంతో మరో 30,000 రూపాయలు అదనపు ఖర్చు తగ్గుతుండటంతో గృహనిర్మాణ లబ్ధిదారులు మంత్రి రంగనాథ రాజు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. పంపిణీ కార్యక్రమంలో మార్టేరు సర్పంచ్ మట్టా కుమారి , ఉప సర్పంచ్ కర్రీ వేణు బాబు , TVNS రెడ్డి, నడిపూడి గణపతి , పండు తదితరులు పాల్గొన్నారు.
Tags kovvuru
Check Also
ప్రాజెక్టుల పైన గుంటూరు జిల్లా కలెక్టరేట్ లో సమీక్ష
-లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యాక్రమాల అమలు చైర్మన్, కేంద్ర ప్రాయోజిత పథకాలు మరియు ప్రాజెక్టుల పైన గుంటూరు జిల్లా …