-శనివారం నుంచి కొవ్వూరు పట్టణంలో వ్యాక్సినేషన్
-డా. వరలక్ష్మీ
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు మునిసిపాలిటీ పరిధిలో 12-14 సంవత్సరాలు వయస్సు ఉన్న పిల్లల కి కార్బీవ్యాక్స్ కోవిడ్ వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. వరలక్ష్మీ పేర్కొన్నారు. శుక్రవారం ఒక ప్రకటన లో వివరాలు తెలుపుతూ, 15.3.2008 నుంచి 15.3.2010 మధ్య జన్మించిన పిల్లల కు వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే గత రెండు రోజులుగా 20 మంది చొప్పున పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ వెయ్యడం జరిగిందన్నారు. వివిధ పాఠశాలల్లో చదివే 12-14 వయస్సు ఉన్న పిల్లలు వివరాలు స్కూల్స్ నుంచి, ఇంటింటి సర్వే ద్వారా సేకరిస్తున్నట్లు, ఇందు కోసం వాలంటీర్, తదితరులు సేవలు వినియోగించు కుంటున్నట్లు ఆమె తెలిపారు. కొవ్వూరు పట్టణంలో ని రెండు అర్బన్ హెల్త్ కేంద్రాలలో శనివారం నుంచి వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు. సర్వే వివరాలు సేకరణ తదుపరి ఆయా స్కూల్స్ లోనే వ్యాక్సిన్ వేస్తారన్నారు. కొవ్వూరు పరిధిలో వ్యాక్సినేషన్ ను ప్రత్యేక మెడికల్ టీం లో డా. సిహెచ్. రాజీవ్, డా.బి.శ్రీనివాస్, డా.కె. సత్య ఆధ్వర్యంలో చేపడుతున్నారు.