కొచ్చి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ నూతన పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తోందని దేవులపల్లి అమర్ అన్నారు. ఈరోజు కొచ్చిలోని లే మెరిడియన్ లో జరిగిన మలనాడు టీవీ బిజినెస్ కాంక్లేవ్ – ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డ్స్ 2022 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ విండో పద్ధతిలో ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నందున పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు అని, అదేవిధంగా రైతులు, ఉత్పత్తిదారులకు లాభం కలిగే విధంగా సేంద్రియ వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది అని అమర్ చెప్పారు. మలనాడు టీవీ మేనేజింగ్ ఎడిటర్ ఆర్.జయేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలు, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అందిస్తున్న సేవలు అద్భుతమని అభినందించారు. జర్నలిజం రంగంలో చేసిన సేవలకు టీవీ ఇండియా దర్శన్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు 2022 పురస్కారాన్ని అమర్ అందుకున్నారు. వి.బి. రాజన్ సీనియర్ జర్నలిస్ట్, అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …