Breaking News

వైస్సార్సీపీ ప్రభుత్వం లో కల్తీమద్యంపై ఉక్కుపాదం : డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మద్యం కల్తీకి పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేస్తుందని ఆదివారం తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ కార్యాలయం లో నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ స్పష్టం చేశారు. ఈ రోజు వరకు కల్తీ మద్యంపై 13 వేల కేసులు నమోదు చేసిన జగన్మోన్ రెడ్డి ప్రభుత్వం. ఎక్కడా తప్పు జరగొద్దనే ఈ తరహాలో కేసలు నమోదు చేసి కఠినచర్యలు తీసుకుంటున్నారు. అటువంటి వారిని ప్రోత్సహించాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పారు. బాబు హయాంలోనే అనుమతులు ఈ డిస్టిలరీలు టీడీపీ నాయకులవి కాదా ? విశాఖ డిస్టిలరీస్‌ అయ్యన్నపాత్రుడిది కాదా?పీఎంకే డిస్టలరీస్‌ యనమల రామకృష్ణుడు వియ్యంకుడిది కాదా?, శ్రీకృష్ణా డిస్టిలరీస్‌ ఆదికేశవుల నాయుడిది కాదా? ఎస్పీవై డిస్టిలరీస్‌ ఎస్పీవై రెడ్డిది కాదా? వీరంతా టీడీపీ వారు కాదా? వీటన్నింటికీ అనుమతి ఇచ్చింది చంద్రబాబు కాదా? 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి, ఒక బ్రూవరీకి సీఎం జగన్‌ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. సప్లయర్లు వారి రేట్‌ కాంట్రాక్టు అగ్రిమెంట్లను పొడిగించుకునేందుకు పూర్తి స్వేచ్ఛ ఉంది. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చేసే షో రాజకీయాలు చూసి ప్రజలు నమ్మే ప్రసక్తే లేదన్నారు.

కార్పొరేటర్లు నిర్మలాకుమారి, ప్రవల్లిక, రిహేనా నాహీద్ మరియు ఇంచార్జ్ పద్మావతి మాట్లాడుతూ… సహజ మరణాలను కూడా టీడీపీ వక్రీకరిస్తోంది. నివారణ కోసం ప్రత్యేకంగా ‘ఎస్‌ఈబీ’ వ్యవస్థను తెచ్చాం.ఏ ప్రభుత్వాలు చెయ్యలేని పని మా వైస్సార్సీపీ ప్రభుత్వంలో చేసి చూపించాం. ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా బెల్టు షాపులు. బడులు, గుడులు పక్కనా.. రాత్రింబవళ్లు ఏరులై పారిన మద్యం. మేం రాగానే 43 వేల బెల్ట్‌ షాపులను నిర్మూలించాం. పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశాం. మద్యం వినియోగాన్ని తగ్గించాలన్నదే జగన్మోహన్ రెడ్డి తపన, తాపత్రయం. ప్రెసిడెంట్‌ మెడల్‌ బ్రాండ్‌కు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2018 ఫిబ్రవరి 6న అనుమతి లభించింది. గవర్నర్స్‌ రిజర్వ్‌ బ్రాండ్‌కు 2018 నవంబరు 5న, హైదరాబాద్‌ విస్కీ బ్రాండ్‌కు 2017 నవంబరు 22న అనుమతి ఇచ్చారు. గవర్నర్‌ పేరు మీద ఉన్న ఇతరత్రా బ్రాండ్లు, నెపోలియన్‌ పేరు మీద ఉన్న బ్రాండ్లు, ఓక్టన్‌ పేరు మీద ఉన్న బ్రాండ్లు, సెవెన్త్‌ హెవెన్‌ పేరు మీద ఉన్న బ్రాండ్లు.. వీటన్నింటికీ ఏపీ స్టేట్‌ బ్రూవరీస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 2018 అక్టోబరు 26న అనుమతి ఇచ్చింది. విరా, బ్లాండే లాంటి బ్రాండ్లతో పాటు బూమ్‌ బీరు తీసుకు వచ్చింది చంద్రబాబే. 2019 మే 14న బూమ్‌ బీరుకు అనుమతి ఇచ్చారు. హై ఓల్టేజి గోల్డ్‌ బీరు, ఎస్‌ ఎన్‌ జే బీరు, బ్రిటీష్‌ ఎంపయర్‌ బీరు.. ఇవన్నీ రాష్ట్రంలో రంగ ప్రవేశం చేసిందీ 2017 జూన్‌ 7న. రాయల్‌ ప్యాలెస్‌ బ్రాండ్లు, లూహీ 14 బ్రాండ్లు, సైనవుట్‌ బ్రాండ్లు రంగ ప్రవేశం చేసింది 2018 నవంబరు 9న. అందుకే కట్టుదిట్టమైన ఆంక్షలు.. పరిమిత వేళల్లోనే విక్రయం. ప్రభుత్వన్ని విమర్శించే అర్హత గద్దె రామ్మోహన్ కి, టిడిపి నాయకులూ కి అర్హత లేదు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గా ఉండి కూడా నియోజకవర్గ అభివృద్ధికి చేసింది సున్యం. ఒకపక్కన రాష్టం సంక్షేమమే దిశగా వెళ్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక పని పాట లేక అప్పుడు అప్పుడు ఇలా పిచ్చి పిచ్చి పనులు చేస్తే మా వైస్సార్సీపీ ప్రభుత్వానికి ఉడేదేం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషం గా ఉన్నారు. మీరు ఎన్ని వేషాలు వేసిన రాబోయే 30 సవంత్సరాలు జగన్మోరెడ్డి ముఖ్యమంత్రి గా ఉంటారన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *