Breaking News

రాష్ట్రంలో మధ్య వినియోగ నియంత్రణ ప్రభుత్వ విధానం..

-ఈ విధానం అమలు ద్వారా 37 శాతం మద్యం, 77 శాతం బీర్లు అమ్మకాలు తగ్గినవి…
-జంగారెడ్డిగూడెం సంఘటనలో మద్యం కారణంగానే మరణాలు సంబవించినవనే ఆధారాలు ఎక్కడా లేవు..
-బాధిత కుటుంబాల ఫిర్యాదు పై విచారణ చేపట్టాం..
-మూడు బాధిత కుటుంబాల ఫిర్యాదు పై విచారణ చేపట్టాం..
-గత ప్రభుత్వం కంటే 150 శాతం ఎక్కువగా శాంపిల్స్ పరీక్షలు నిర్వహించాం..
-రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజిత్ భార్గవ..
-ఎస్. ఇ. బి. కమిషనర్ వినీత్ బ్రిజిలాల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ఏ ఒక్క డిస్టలరీ కంపెనీ కి అనుమతి ఇవ్వలేదని గతంలో ఏ డిస్టలరీ కంపెనీల్లో అయితే మద్యం తయారుతుందో ఇప్పుడు కూడా అక్కడే తయారు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజిత్ భార్గవ అన్నారు.
విజయవాడ ఆర్టీసీ కాంప్లెక్స్ లోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రజిత్ భార్గవ మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం వాడకం గణనీయంగా తగ్గిందని అన్నారు -ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లిక్కర్ 37 శాతం, బీరు 77 శాతం అమ్మకాలు తగ్గినవన్నారు. రాష్ట్రంలో రెవెన్యూ దృష్ట్యా కొన్ని మద్యం బ్రాండ్ల రేట్లు పెంచామని , కొన్ని బ్రాండ్ల రేట్లు తగ్గించామన్నారు . రాష్ట్రంలో ఉన్న 43 వేల బెల్ట్ షాపులను తొలగించామన్నారు -గతంలో మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేసేవని , ఈ ప్రభుత్వం వచ్చాక ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే మద్యం దుకాణాలు పనిచేస్తున్నాయి అని అన్నారు . ప్రజల్లో మద్యం సేవించడాన్ని తగ్గించడానికి మద్యం విమోచన ప్రచార కమిటీలు రాష్ట్రం అంతా పనిచేస్తున్నాయని , ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా దశల వారీగా మద్యం వాడకాన్ని నియంత్రించామన్నారు. అక్రమం మద్యం పై ఈ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు.
ఎస్ ఈబీ ఏర్పాటు అయిన తర్వాత 2020 నుంచి ఇప్పటివరకు 93,722 కేసులను నమోదు చేసి 70 వేల మందిని అరెస్ట్ చేశామన్నారు. డ్రోన్లు, జియో ట్యాగింగ్ ద్వారా నాటుసారా, గంజాయి అక్రమ రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకున్నామన్నారు -ఆంధ్రప్రదేశ్ లో ఎస్ ఈబీ ఏర్పాటు అయిన తర్వాత 2 వేల ఐడీ తయారీ ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు -కొన్ని జిల్లాల్లో జిల్లా ఎస్పీలు స్వయంగా సారా, గంజాయి, అక్రమ రవాణా అరికట్టే ఆపరేషన్ లో పాల్గొంటున్నారన్నారు . గత రెండేళ్ల లో 14 మంది పై పీడీ యాక్ట్ పెట్టామన్నారు. ప్రతి జిల్లాలో ఎక్కువగా ఐడీ తయారు చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నామన్నారు. గంజాయి, సారా తదితర వాటిపై ఎస్ ఈబీ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు.
2014 -2019 మద్యలో కేవలం 99 వేల శాంపిల్స్ తీసుకున్నామన్నారు . 2019-2020 లో 93 వేలు, 2020 -2021 లో 1,55,000 శాంపిల్స్ తీసుకున్నామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 1,47,000 శాంపిల్స్ పరీక్షలు జరిపామని, గతంతో పోలిస్తే ఎక్కువ శాంపిల్స్ కు పరీక్షలు జరిపామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత 5 ల్యాబ్ లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడ్డాయన్నారు. ఏపీలో సరఫరా అయ్యే మద్యానికి సంబంధించిన శాంపిల్స్ గతంతో పోలిస్తే భారీగా శాంపిల్స్ సేకరించి పరిక్షలు జరిపామన్నారు.
ఎస్ ఈబీ కమిషనర్ వినీత్ బ్రిజిలాల్ మాట్లాడుతూ 2020 మే లో ఎస్ ఈబీ ఏర్పాటయ్యిందని , దేశంలోనే ఇలాంటి శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మొదటిగా ఏర్పాటు చేయబడిందన్నారు . నాటుసారా తయారీ, గంజాయి, ఎర్రచందనం, అక్రమ స్మగ్లింగ్ లపై చర్యల కోసం ఎస్ ఈబీ ఏర్పాటు అయ్యిందన్నారు. ఎస్ ఈబీ ఏర్పాటు అయిన తర్వాత మే 2020 నుంచి ఇప్పటివరకు 93,722 కేసులు నమోదు చేశామని , 70 వేల మందికి పైగా అరెస్ట్ చేశామన్నారు. గతంతో పోలిస్తే సారా తయారీ పై గట్టి చర్యలు తీసుకున్నామన్నారు. వైజాగ్ ఏజెన్సీ లో ఆపరేషన్ పరివర్తన్ నిర్వహించామన్నారు.
జంగారెడ్డిగూడెం సంఘటన కు సంబంధించి మద్యం కారణంగానే మరణాలు సంభవించినట్లు ఆధారాలు లేవన్నారు. మూడు బాధిత కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ చేపట్టామన్నారు. ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ ఆధారంగా విచారణ నిర్వహించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వినీత్ బ్రిజిలాల్ అన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *