గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వం క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర సంఘటన్ గుంటూరు ఆధ్వర్యం లో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి రాజభాష హిందీ కార్యశాలను నిర్వహించారు. ఈ సందర్భముగా హిందీ భాష లో వకృత్వ పోటీలు, క్విజ్ కాంపిటేషన్స్, గ్రూప్ డిస్కషన్స్ మరియు రాష్ట్రస్థాయిలో నెహ్రు యువకేంద్ర సిబ్బందికి వెబినార్ నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిధి గా హాజరైన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మరియు యానాం సంచాలకులు బి జె ప్రసన్న మాట్లాడుతూ జాతీయభాష, జనప్రియమైన భాష, అతి సుందరభాష, భారతీయులెందరో భాషించే భాష, అమర ఖ్యాతి గన్న అద్వితీయ భాష, రాజభాషగా రాణించే రమ్యమైన భాష. ఇలా హిందీ భాష గురించి ఎంతగానో చెప్పుకోవచ్చని అన్నారు.కబీర్ దాస్, తులసి దాస్, సమాజ కళ్యాణం కోసం హిందీలో అనేక సరళమైన రచనలు చేశారు. హిందీ భాష ద్వారా త్వరగా ఉపాధి పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ భాషగా హిందీ మన దేశంలో కోట్లాది ప్రజల గుండెచప్పుడు వినిపించే భాషగా హిందీ ఉంది. అంతర్జాతీయ భాషగా గుర్తింపు పొందింది అని అయన అన్నారు.ఈ కార్యక్రమం లో అతిధులుగా పాల్గొన్నా నెహ్రూ యువ కేంద్ర గుంటూరు జిల్లా యువ అధికారి కిరణ్మయి దేవిరెడ్డి, షేక్షావలి, ప్రోగ్రాం అసిస్టెంట్లు బుర్రా సీతారాం మరియు వినయ్ కుమార్ ప్రసంగిచారు. అలాగే ఈ కార్యక్రమము లో పోటీలులో గెలుపొందిన యువతకు ప్రశంసాపత్రాలు మరియు బహుమతులు అందజేశారు. ఈ కార్య క్రమములో యువజన సంఘాల సభ్యులు మరియు గుంటూరు నెహ్రు యువ కేంద్ర వాలంటీర్లు పాల్గొన్నారు.