న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలను అత్యుత్తమ సంస్థలుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకం రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్ష అభియాన్ (రూసా) అని విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాస్ సర్కార్ తెలిపారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ రూసా నిధులకు రాష్ట్రాల వాటాను సకాలంలో జమ చేయడం అంతకు ముందు విడుదల చేసిన నిధులలో 75 శాతం నిధులు ఖర్చు చేయడం వంటి కొన్ని షరతులకు లోబడి మాత్రమే తదుపరి నిధుల విడుదల జరుగుతుందని చెప్పారు. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచనలకు ఆయా రాష్ట్రాలు కట్టుబడి ఉన్నట్లుగా తేలిన తర్వాత మాత్రమే కేంద్ర గ్రాంట్లు విడుదల చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.
Tags delhi
Check Also
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
-అసెంబ్లీ తీర్మానాన్ని హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం -లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాల తరలింపు ఉండదు…కర్నూలులోనే ఉంటాయి -యువగళం హామీ మేరకు …