మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజానికి సాహిత్య అవసరం ఎంతో ఉందని కథ, నవల, వ్యాసం, కవిత, ఇలా అన్ని ప్రక్రియలను చదివి వాటిలోని మానవీయ విలువలను అవగాహన చేసుకున్ననాడు మరిన్ని మంచి రచనలు వెలువడడానికి ఆస్కారం ఉందని ఆ దిశగా ప్రతీ ఒక్కరూ కృషిచేసి మన తెలుగుభాష గొప్పదనాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తిచేయాలని, ఆ దిశగా కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
బుధవారం ఉదయం ఆయన శాసనసభ సమావేశాలకు ఉదయం 7:30 గంటల సమయంలో హడావిడిగా తాడేపల్లి ప్రయాణమవుతూ, తన కార్యాలయంకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు తెలుసుకొన్నారు.
తొలుత మచిలీపట్నానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయులు ఆచార్య పన్యారం సాంబశివరావు మంత్రి పేర్ని నానిని కలిసి ఇటీవల తనకు అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన పొయిట్రీ కార్నర్ సాహిత్య సంస్థ నిర్వహించిన ప్రపంచ సాహిత్య పోటీల్లో తన కవిత ‘ సమాజంలో స్త్రీ ‘ ప్రథమ బహుమతి పొందినట్లు 2000 అమెరికా డాలర్లు నగదు బహుమతితో పాటు ఒక జ్ఞాపిక లభించిందని తెలిపారు. ఈ అరుదైన పురస్కారం సాంబశివరావు మాస్టారుకు దక్కడంపై అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, సాహిత్యం ద్వారా సమాజంలో చైతన్యం వస్తుందని, ప్రకృతిలోని ప్రతి అంశంపై రచనలు చేసే స్వేచ్ఛ కవులకు ఉందన్నారు. ఎంతమంది కవులుంటే అంతగా సమాజం బాగుపడుతుందని, యువకులు సాహిత్యం వైపు మరలాలని అన్నారు.
స్థానిక శివగంగ ప్రాంతానికి చెందిన వేములపల్లి శివ పార్వతి మంత్రికి తన సమస్యను చెప్పుకున్నారు.. గతంలో తమకు టిడ్కొ గృహ సముదాయంలో తన పేరున జి ప్లస్ త్రీ ఇల్లు మంజూరు అయిందని, అందుకు సంబంధించి తాము డబ్బులు సైతం చెల్లించినట్లు కానీ ఇంటి పట్టా ఇప్పటివరకు అధికారులు ఇవ్వలేదని తెలిపింది. ఈ విషయమై స్పందించిన మంత్రి మాట్లాడుతూ, మీ పేరున పట్టా ఉండడం వాస్తవమేనని గతంలో నాలుగువేల ఇళ్లకు గాను 2800 ఇళ్ళు మాత్రమే కొంతమేర పూర్తయ్యాయని… మిగిలిన ఇళ్లు అసలు ప్రారంభించలేదని వాటికి బదులుగా లబ్ధిదారులకు జగనన్న ప్రభుత్వం ఇంటిస్థలం పట్టాతో పాటు ఇల్లు నిర్మించుకోవడానికి లక్షా ఎనభై వేల రూపాయలు సైతం ఇద్దామని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారని, టిడ్కో గృహం అయితే.. 20 సంవత్సరాల పాటు లబ్ధిదారుడు కిస్తీలు క్రమం తప్పకుండా చెల్లించాలని మంత్రి తెలిపారు.
Tags machilipatnam
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …