Breaking News

కంటెంట్ ఉంటే, కటౌట్ అవసరం లేదు… : నగరి ఎమ్మెల్యే రోజా

– మచిలీపట్నం లో ముగిసిన క్రీడాసంబరం
-వైఎస్సార్ – పి కె ఎం కప్ సీజన్ – 2 క్రికెట్ టోర్నమెంటు
-ముగింపుకార్యక్రమంలో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే రోజా
-క్రికెట్ టోర్నీ విజేత ఆరెంజ్ ఆర్మీ
-రన్నర్స్గా హుస్సేనీ ఎలెవన్ జట్టు
-12 రోజుల పాటు సాగిన క్రికెట్ సంబరం
-48 జట్లు.. 500 మంది క్రీడాకారులు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కంటెంట్ ఉంటే, కటౌట్ అవసరం లేదని ఇంత చిన్న భుజాలపై ఎంతో పెద్ద క్రికెట్ టోర్నమెంట్ భారాన్ని మనోస్థైర్యం, ఆత్మవిశ్వాసంతో నిర్వహించడం సాధారణ విషయం కాదని ఎంతో శ్రమ, వ్యయంతో కూడిన పని అని యువనేత పేర్ని కిట్టు సమర్థత నాయకత్వ లక్షణాలు ఎంతో అభినందనీయుడని వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా సెల్వమణి ప్రశంసించారు.
జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని హిందూ కళాశాల , ఆంధ్రా జాతీయ కళాశాలల మైదానాలాలో వైఎస్సార్ – పి కె ఎం కప్ సీజన్ – 2 క్రికెట్ టోర్నమెంటు బుధవారం సాయంత్రం అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిసింది. యువ నాయకుడు , మంత్రి పేర్ని నాని తనయుడు పేర్ని కృష్ణమూర్తి ( కిట్టు ) నేతృత్వంలో నిర్వహించిన ఈ పోటీల్లో 48 టీములు పాల్గొన్నాయి. ఎనిమిది రోజుల పాటు జరిగిన పోటీల్లో 500 మంది క్రీడాకారులు సందడి చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన అగ్రనేతలు మంత్రి కొడాలి నాని, శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి , నగరి ఎమ్మెల్యే రోజూలు ఈ టోర్నమెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా పాల్గొని యువ క్రికెటర్లను ఎంతో ఉత్సాహపరిచారు.
12 రోజులపాటు క్రికెట్ సంబరంలా సాగిన టోర్నమెంట్ చివరి రోజు ఫైనల్స్లో ఆరంజ్ ఆర్మీ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 187 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు హుస్సేనీ ఎలెవన్ జట్టుకు నిర్దేశించగా వారు 20 ఓవర్లలో 153 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో ఆ జట్టు రన్నర్స్గా నిలిచింది. విజేత జట్టులో కైకలూరు ప్రాంతానికి చెందిన సందీప్ ఫైనల్స్ లో సెంచరీ సాధించారు. 110 పరుగులు సాధించి జట్టు విజయానికి ముఖ్య భూమిక వహించారు. అలాగే హుస్సేన్ ఎలెవెన్ జట్టులో అనంత్ 71 పరుగులు సాధించారు. విజేత జట్టు ఆరెంజ్ ఆర్మీ కు లక్ష రూపాయల నగదు, ట్రోఫీ ను ఎమ్మెల్యే రోజా అందించారు. అలాగే ప్రత్యర్థి హుస్సేనీ ఎలెవన్ జట్టుకు 50 వేల రూపాయల నగదు బహుమతి ఆమె అందచేశారు.
ఈ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో మచిలీపట్నం నగర పాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత థామస్ నోబుల్, మచిలీపట్నం మున్సిపల్ మాజీ చైర్మన్ షేక్ సలార్ దాదా, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా (అచ్చాబా), ముడా ఛైర్పర్సన్ బొర్రా నాగభవాని విఠల్ , కార్పొరేటర్లు శ్రీవాణి, కో – ఆప్షన్ సబ్యరాలు మట్టా తులసి, వైయస్సార్ సిపి పార్టీ అధికార ప్రతినిధి మాదివాడ రాము, కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గూడవల్లి నాగరాజు, వైయస్సార్సీపి సీనియర్ నాయకులు చిటికెన నాగేశ్వరరావు, గాజుల భగవాన్ తదితర కార్పొరేటర్లు మహమ్మద్ రఫీ, మరీదు నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *