తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలిలో నూతనంగా మీడియా సంస్థ బుద్ధ టీవీ కార్యాలయాన్ని స్థానిక బాలాజీరావుపేటలో మంగళవారం ప్రారంభించారు. బుద్ధ టీవీ సీఈఓ దుర్గారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సతీష్‌రెడ్డి, అతిధులుగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డివిజన్ కార్యదర్శి, దర్శకులు కనపర్తి రత్నాకర్, గుంటూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కుమార్ రాజలు కార్యాలయంలోని స్టూడియో, నూతన గదులను రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ ఫైట్ ఫర్ బ్రైట్ నినాదంతో మీడియారంగంలోకి అడుగుపెట్టిన బుద్ధ టీవీ మీడియారంగంలో రాణించాలని ఆకాంక్షించారు. సామాన్యుడి పక్షాన నిలిచి ప్రజల సమస్యల పరిష్కారంలో తమవంతు పాత్ర పోషించాలన్నారు. తెనాలిలో వృత్తిపరంగా తమవంతు సహకారం ఉంటుందన్నారు. గుంటూరు జిల్లా బ్రాంచ్ ఇంచార్జి తిరుమలరావు మాట్లాడుతూ తెనాలిలో బుద్ధా టీవీ ఎలక్ట్రానిక్ మీడియా రావడం చాలా సంతోషకరం అన్నారు. గుంటూరు ప్రెస్‌క్లబ్ ప్రెసిడెంట్ కుమార్ రాజా మాట్లాడుతూ మంచి ఆశయాలతో మంచి సర్వీస్‌తో గత సంవత్సర కాలం నుంచి మంచి సేవలు అందిస్తున్న బుద్ధా టీవీ ఇంకొక బ్రాంచ్‌ని ప్రారంభించినందుకు అభినందనలు తెలిపారు. బుద్ధా టీవీతో తనకు ఉన్న గత అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. బుద్ధా టీవీ సీఈఓ, ఎండిలు దుర్గారెడ్డి, సతీష్‌రెడ్డి నూతన విధానంముతో మీడియారంగంలో సరికొత్త కార్యక్రమాలతో లేటెస్ట్ పరికరాలతో శరవేగంగా దూసుకుపోతోంది అని వివరించారు. అదే విధంగా ప్రజా సమస్యలపై ఒక టోల్ ఫ్రీ నెంబర్‌ని ఉంచడం జరిగిందన్నారు. ఏదైనా సమస్యలపై నెంబర్‌కి కాల్‌చేసిన యెడల సమస్య పరిష్కారానికై బుద్ధా టీవీ పాటు పడుతుంది అని తెలిపారు. కార్యక్రమంలో బుద్ధా టీవీ సంస్థ అధినేత దుర్గారెడ్డి, ఎండి సతీష్ రెడ్డి, గుంటూరు బ్రాంచ్ ఇంచార్జి తిరుమలరెడ్డి, తెనాలి ఇంచార్జి దినేష్ బుద్ధా టీవీ స్టాఫ్, ఎం.శ్రీకాంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Tags tenali
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …