ఆచంట / తాడేపల్లిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రజలకు , నియోజకవర్గ ప్రజలకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలని శుక్రవారం ఒక ప్రకటన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు తెలియచేసారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటన లో మంత్రి శ్రీరంగనాధ్ రాజు శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్రంలో, వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ జీవితాల్లో శుభాలు జరగాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. ప్రతి తెలుగు ఇంటి లోగిళ్ళ లో తెలుగు ప్రజలు ఉగాది రోజున నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా జరుపు కుంటారన్నారు. షడ్రుచుల కలియకకి ప్రతీకగా నిలిచే ఉగాది పచ్చడి జీవన సత్యాన్ని తెలియ చేస్తుందన్నారు. మీ జీవితంలో ఈ ఉగాది నుంచి మరింతగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు తో ఆనందోత్సవాలు పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటూ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి లబ్దిదారుడు స్వంత ఇంటి కల సాకారం కావడానికి, స్వచ్ఛందంగా ముందుకీ వచ్చి ఇంటి నిర్మాణాలు వేగవంతం చేయాలని కోరారు.
పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో పంచగ్రామ రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో రాజశేఖరరెడ్డి గారి విగ్రహం ఎదురుగా ఏర్పాటు చేసిన చలివేంద్రంను మంత్రి ప్రారంభించారు.