అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర మహిళాభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ సంచాలకురాలిగా డాక్టర్ ఎ సిరి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతపురం సంయిక్త కలెక్టర్ గా విధి నిర్వహణలో ఉన్న సిరిని జిల్లాల పునర్ విభజన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ శాఖాధిపతిగా నియమించింది. సోమవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో గుంటూరులోని సంచాలకుల వారి కార్యాలయంలో పూజాదికాలు నిర్వహించి నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిరి మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు క్షేత్రస్ధాయికి చేరేలా కృషి చేస్తానన్నారు. ఉద్యోగులు అంకిత భావంతో విధులు నిర్వహించి ముఖ్యమంత్రి ఆకాంక్షల మేరకు నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని కోరారు.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …