రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, మండల స్థాయి అధికారులలో సమన్వయం లోపం లేకుండా పనులు వేగవంతం కోసం చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత పేర్కొన్నారు. స్పందన ఫిర్యాదులు ఎస్ ఎల్ ఏ పరిధిలోనే ఉండాలని, 24 గంటల్లో పరిష్కారించాలన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో డివిజన్ , మండల స్థాయి అధికారులతో హౌసింగ్, ఓటీఎస్, స్పందన తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలసి బుధవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లా పరిధిలో 46,089 మంది ఇళ్ళ నిర్మాణం కోసం మంజురూ చెయ్యడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 41,700 పైగా లబ్దిదారులు ఇంటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని గత రెండున్నర ఏళ్ల క్రితం లబ్దిదారులను గుర్తించి, భూసేకరణ చేసి, స్థలాలు కేటాయించి, భూముల లేవిలింగ్ పనులు చేపట్టామన్నారు. ఇళ్ళ నిర్మాణం కోసం పట్టాలు అందచేసిన ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం చేసేలా అధికారులు సమన్వయంతో పని చెయ్యాల్సి ఉందన్నారు. తాహశీల్దార్లు, ఎంపీడీఓ లు, హౌసింగ్, ఆర్.డబ్ల్యూ.ఎస్, నరేగా, ట్రాన్స్ కో, నరేగా తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో చేసే పని విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇంటి నిర్మాణాలు వేగవంతం చేసేందుకు అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి, నివేదిక సమర్పించాలన్నారు. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణం కోసం అవసరమైన ఇసుక, స్టీల్, సిమెంట్, ఐరన్ వంటి సామగ్రి పంపిణీ చేయాలన్నారు. మనం ఇంటి నిర్మాణం కోసం అవసరమైన మెటీరియల్ అందచేయ్యడం ద్వారా ఇంటి నిర్మాణం చెయ్యడానికి లబ్దిదారుడు తప్పక ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. లబ్దిదారుడు కి అవసరమైన సామగ్రి అందచేసే భాద్యత హౌసింగ్ ఏ ఈ లు తీసుకోవాలని కలెక్టర్ మాధవీలత ఆదేశించారు. రానున్న సమావేశం నాటికి సచివాలయ వారీగా ప్రగతిపై సమీక్ష చేపడతానని అందుకు అనుగుణంగా సిద్ధంగా ఉండాలన్నారు. గ్రౌండింగ్ , లేవిలింగ్ పనులు, విద్యుత్తు, ఎన్ని లే అవుట్ల లో నీటి సరఫరా, విద్యుత్తు లైన్స్, రహదారి తదితర పనుల ప్రగతి, సమస్య పై స్పష్టత ఉండాలన్నారు. ఓటీఎస్ పై సమీక్ష చేస్తూ, ఆన్లైన్ లోని డేటా ఆధారపడి నివేదిక సమర్పించాలని కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, గ్రామ స్థాయిలో విఆర్వో, పంచాయతీ సెక్రటరీ స్థాయిలో పరస్పరం అవగాహన , సమన్వయం కలిగి ఉండాలన్నారు. ఆమోదించిన ఓటీఎస్ లబ్దిదారుడు కి ఇంటి రిజిస్ట్రేషన్ పట్టాలను పంపిణీ చేయడం కోసం ప్రణాళికలు తయారు చేసుకోవాలన్నారు. మొత్తం 21,706 రుణాలు పొందిన వారిలో 3011 మందికి పట్టాలు పంపిణీ చేసారని, 30,174 రుణాలు తీసుకొని వారిలో 11,792 మంది కి పట్టాలు అందించడం పై వివరాలు అడిగారు. ఓటీఎస్ లో ప్రగతి సాధించడం లో పూర్తిగా వెనుకబడిన మండలాలు, పురపాలక సంఘాల అధికారులు పనితీరు మెరుగు పరుచుకోవడానికి చొరవ చూపాలని మాధవీలత స్పష్టం చేశారు. రికార్డ్ స్కానింగ్ నుంచి లాగిన్ లో అప్రువల్ వరకు ప్రతి స్టేజి విషయం లో చురుగ్గా వ్యవహరించాల్సి ఉందన్నారు.
జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, రేపటి నుంచి ఇంటి నిర్మాణం, ప్రగతిపై మండల వారీగా టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. సచివాలయ తనిఖీలు చెయ్యడం జరిగిందని, కొన్ని సచివాలయ ల్లో హాజరు వివరాలు నమోదు చేయడం లో కొంత ఆలక్ష్యం కనపడిందన్నారు. రాబోయే రోజుల్లో సచివాలయ వారీగా ఓటీఎస్, ఇండ్ల నిర్మాణం ప్రగతి పై సమీక్ష చేస్తామని తెలిపారు. సచివాలయ వారీగా లక్ష్యాలు తక్కువగా ఉంటాయన్నారు. డ్రెస్ కోడ్ తప్పనిసరి అన్నారు. సచివాలయ నేమ్ బోర్డ్, సోషల్ ఆడిట్ నివేదిక ప్రముఖంగా సచివాలయ ల్లో ప్రజలకీ అందుబాటులో ఉంచాలన్నారు. మధ్యాహ్న భోజనం పధకం, అంగన్వాడీ కేంద్రా లను తనిఖీ చెయ్యాలి. పిల్లలు హాజరు పై దృష్టి సారించాలన్నారు.
ఈ సమావేశానికి హౌసింగ్ ఎస్ ఈ డి.తారక్ చంద్, ఆర్డీవో ఎస్.మల్లిబాబు, హౌసింగ్ డీఈ సిహెచ్. బాబు రావు, జి. సోము, 19 మండల తహశీల్దార్ లు, ఎంపీడీఓ లు, హౌసింగ్ , మునిసిపల్ ఇతర శాఖల అధికారులు, తదితరులు హాజరయ్యారు.