రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉభయ గోదావరి జిల్లా లను కలిపే రోడ్ కం రైల్వే బ్రిడ్జి పరిశుభ్రత , నిర్వహణ విషయంలో అధికారులు చురుగ్గా వ్యవహారించాలని జిల్లా కలెక్టర్ డా.మాధవీ లత స్పష్టం చేసారు. గురువారం నల్లజర్ల మండలం లో ప్రభుత్వ అధికారిక పర్యటన లో భాగంగా ఆ మార్గంలో కలెక్టర్ వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా వంతెన అపరిశుభ్రంగా ఉండడంతో సంబంధించిన శాఖ అధికారితో మాట్లాడడం జరిగింది. కలెక్టర్ ఆదేశాలతో వెంటనే శానిటేషన్ సిబ్బంది వంతెన పై ఉన్న చెత్తను తొలగించడం జరిగింది. రానున్న రోజుల్లో ఎప్పటికప్పుడు జిల్లా కు ప్రతిష్టాత్మకంగా నిలిచిన వంతెనను పరిశుభ్రంగా ఉంచడం లో అధికారులు భాద్యత లు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …