-ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మాజీసైనికులకు సరిఅయిన న్యాయం జరగడంలేదని ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు అన్నారు. ఈ సందర్భంగా ఐఈ జేఏసీ నేషనల్ కమిటీ అధ్యక్షులు మోటూరి శంకరరావు, ఉపాధ్యక్షులు సీతాదేవి, ప్రధాన కార్యదర్శి రెడ్డి, వరప్రసాద్, రత్నప్రసాద్, తిరుపతిరావు, గోవిందరావులు రాష్ట్ర డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ బ్రిగేడియర్ వెంకట్ రెడ్డిని కలిసి మాజీసైనిక సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మోటూరి శంకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో మాజీసైనికులకు సరిఅయిన న్యాయం జరగడంలేదని తెలిపామని దీనికి డైరెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు.రాష్ర్టాలలోని ప్రతి గ్రామంలోని ప్రతి మండలానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.ప్రతి రెవిన్యూ డివిజన్లో ఒక యూనిట్ గా ప్రతిజిల్లాలో జిల్లా ప్రెసిడెంట్ కి అన్నిజిల్లాల అధ్యక్షులు కలిసి స్టేట్ కమిటీ, నేషనల్ అసోసియేషన్ ని బలోపేతం చేయాలనీ, అప్పుడే మాజీసైనికుల సమస్యలు పరిస్కారం అవుతాయి అని అభిప్రాయపడ్డారు.