అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 131వ జయంతి వేడుకలు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ప్రతినిధి రాష్ట్ర అధ్యక్షులు నాగిపోగు కోటేశ్వరరావు పలు ప్రాంతాలలో ఘనంగా నిర్వహించి పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలదండ వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాగిపోగు కోటేశ్వరరావు మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, భారత రాజ్యాంగ నిర్మాతగా సంఘ సంస్కర్తగా ప్రజాస్వామ్య పరిరక్షకునిగా మహామేధావి అయిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహోన్నత వ్యక్తి అని ఆయన కొనియాడారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా స్వీట్స్ పళ్ళు కొరకు వేమండ గ్రామ యువకులకు కొంత ఆర్థిక సహాయం చేయగా వారు ఆయనను ఘనంగా సన్మానించారు. ఉంగుటూరు మండలం వేమండ గ్రామంలోని ఎంపిపి స్కూల్లో యానివర్సిలీ ఫంక్షన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొని పిల్లలకు ప్రసంసాపత్రాలు అందించారు. నాగిపోగు కోటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తమ తమ పిల్లల్ని తప్పకుండా చవించాలని చదువుకున్న అంబేద్కర్‌ని స్పూర్తిగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు విద్యా కమిటీ చైర్మన్ సునీల్, కోపరేట్ బ్యాంక్ అధ్యక్షులు శనగవరపు సాంబశివరావు, గ్రామ ఉప సర్పంచ్ నరిశెట్టి శ్రీనివాసరావు, గ్రామ యువకులు, తదితరులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …