అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్యకార సంక్షేమ సమితి-ఆంధ్రప్రదేశ్ మరియు నేష్నా ట్రస్ట్ సంయక్త ఆధ్వర్యంలో బాల సంస్కార కేంద్రాల ఉపాధ్యాయుల శిక్షణా తరగతులు 2రోజులు -14 &15 ఏప్రిల్ 2022న విజయవాడ సీతానగరం, శ్రీ చిన్న జీయర్ స్వామిజి ఆశ్రమంలో ఘనంగా జరిగాయి. శ్రీమాన్ శ్రీ చిన్నజీయర్ స్వామి వారి అనుగ్రహ ఆశీస్సులు, మంగళశాసనాలుతో ప్రారంభం జరుగగా, మత్స్య కార సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొలంగారి పోలయ్య, పరిమెల్ల వాసుల పర్యవేక్షణలో నేష్నా ట్రస్ట్ డైరెక్టర్ స్వాతి మహంతి మరియు MSS రాష్ట్ర కమిటీ పాల్గొన్నారు. విజయకీలాద్రి వేద పాఠశాల ఉపన్యాసకులు సముద్రాల శ్రీనివాసాచార్యులువారు, విద్యా భారతి సంఘటనా మంత్రి కన్నా భాస్కర్, సరస్వతి విద్యా పీఠం డైరెక్టర్ జగదీశ్, MSS రాష్ట్ర విద్యా విభాగం అధ్యక్షులు మహేష్ లు మార్గదర్శనం చేశారు. 4 జిల్లాలు, 7మండలాలు 59 కేంద్రాలనుండి ఉపాధ్యాయులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …