Breaking News

విదులలో అలసత్వం సిబ్బందిపై చర్యలు తప్పవు – విధులలో నిర్లక్షం వహిస్తే ఉపేక్షించేది లేదు…

-పారిశుధ్య మరియు సచివాలయ సిబ్బందికి షోకాజ్ నోటీసులు
-కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.,

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణలంక, రాణిగారి తోట, రామలింగేశ్వర నగర్ ప్రాంతాలలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్., సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, పారిశుధ్య నిర్వహణ విధానము మరియు స్థానిక ప్రజల ఇబ్బందులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. 15వ డివిజన్ నందలి పారిశుధ్య నిర్వహణ మరియు డ్రెయిన్స్ శుభ్రపరచకపోవుట కారణంగా మురుగునీటి ప్రవాహం సక్రమముగా లేకపోవడంతో క్షేత్ర స్థాయి పర్యవేక్షణ సిబ్బంది యొక్క పనితీరుపై కమిషనర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, విధులలో అలసత్వం వహించిన శానిటరీ ఇన్స్ పెక్టర్ ఆనంద్ కృపాల్ కు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు. అదే విధంగా లీడ్ వర్కర్ వి.ప్రవీణ్ (APCOS) వర్కర్ ను విధుల నుండి నిలుపుదల చేయాలని మరియు 81వ సచివాలయ శానిటరీ సెక్రటరి బి,స్రవంతి, విధులకు సకాలంలో హాజరుకానందున 84వ సచివాలయ శానిటరీ సెక్రటరి బి.బాలేశ్వరి లకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని సంబందిత అధికారులను ఆదేశించారు. 15వ డివిజన్ పుట్ట రోడ్ నందు పారిశుధ్య నిర్వహణ సక్రమముగా లేకపోవుటచే 69వ సచివాలయ శానిటరీ సెక్రటరి వి.నాగసాయి బాబుకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని ఆదేశించారు.

రామలింగేశ్వరనగర్ 10 యం.ఎల్.డి సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుండి దుర్వాసన వస్తునట్లు స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా సదరు ప్లాంట్ యొక్క నిర్వహణను స్వయంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ ప్లాంట్ ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలని తెలిపిన దానిపై టెండర్ స్టేజి లో ఉందని అధికారులు వివరించిన దానిపై టెండర్ ప్రక్రియ పూర్తి చేసి యుద్దప్రాతిపదికన పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదే విధంగా రామలింగేశ్వర నగర్ ప్రాంతములో గల రిటైనింగ్ వాల్ ప్రక్కన 20 యం.ఎల్.డి ప్లాంట్ వద్ద రోడ్ అభివృద్ధికి ప్రణాళికలను సిద్దం చేయాలనీ అధికారులను ఆదేశించారు. అదే విధంగా రుద్ర భూమిను పరిశీలించిన సందర్భంలో లోపల చెత్త మరియు వ్యర్దములు ఉండుట గమనించి అధికారులను వివరణ కోరగా రాత్రి వేళలలో ఆటోనగర్ నుండి ట్రాక్టర్ల ద్వారా చెత్తను డంపింగ్ చేయుట జరుగుతుందని తెలిపిన దానిపై అయన స్పందిస్తూ, తక్షణమే నైట్ వాచ్ మెన్ ను ఏర్పాటు చేసి చెత్త డంపింగ్ ను నిరోదించాలని ఆదేశించారు.

అదే విధంగా రుద్ర భూమి నుండి పోలీస్ కలోను వరకు రిటైంగ్ వాల్ వెంబడి 60 అడుగుల గ్రావెల్ రోడ్ వేయుటకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నది వెంబడి అనధికార అక్రమణులు ఉండుట గమనించి, యు.సి.డి, పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ అధికారులు సంయుక్తంగా కలసి పర్యటించి సదరు ఆక్రమణదారులను గుర్తించి వారం రోజులలో వారిని అక్కడ నుండి తొలగించాలని, అర్హత కలిగిన కలిగిన వారికీ గృహాలు కేటాయించే అవకాశాలను కూడా పరిశీలించాలని అన్నారు.

 

పర్యటనలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కార్పొరేటర్ రామిరెడ్డి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.చంద్రశేఖర్, హెల్త్ ఆఫీసర్ డా. ఇక్బాల్ హుస్సేన్, అధికారులు మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *