Breaking News

అప్పులేని రాష్ట్రంగా ఢిల్లీ – ఆప్ తో సుప‌రిపాల‌న…


-అందుకే దేశమంతా కేజ్రీవాల్ ని ఆహ్వానిస్తోంది:
– ఆప్ ఏపీ ఇన్ ఛార్జి మ‌ణి నాయుడు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీలో నీతివంతంగా సుప‌రిపాల‌న అందిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ, అప్పులు తేకుండా ప్ర‌జ‌లంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తోందని ఆప్ ఏపీ ఇన్ ఛార్జి మ‌ణినాయుడు చెప్పారు. అవినీతి ర‌హిత పాల‌న‌కు అర‌వింద్ కేజ్రీవాల్ మారుపేరు అని, అందుకే దేశంలోని సామాన్య ప్ర‌జ‌లంతా అర‌వింద్ రాక‌ను కోరుకుంటున్నార‌న్నారు. ముఖ్యంగా ఏపీలో సీఎం జ‌గ‌న్ పాల‌న అప్పులు, త‌ప్పుల‌తో న‌డుస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇన్ చార్జిగా బాధ్య‌త‌లు స్వీకరించి, ఢిల్లీ నుంచి తొలిసారి విజ‌య‌వాడ‌కు వ‌చ్చిన మ‌ణినాయుడుకు రాష్ట్ర నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆదివారం ఉద‌యం విజ‌య‌వాడ న‌గ‌ర వీధుల్లో ఓపెన్ టాప్ జీపులో మ‌ణినాయుడుతో క‌ల‌సి ర్యాలీ నిర్వ‌హించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జిందాబాద్, అర‌వింద్ కేజ్రీవాల్ రావాలి అంటూ కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేశారు. అనంత‌రం మాకినేని బ‌స‌వ‌పున్న‌య్య విజ్ణ్నాన కేంద్రంలో ఆప్ రాష్ట్ర స‌మావేశాన్ని నిర్వ‌హించారు. కొత్త ఇన్ చార్జిని ఆప్ నేత‌లు పోతిన వెంక‌ట‌రామారావు, క‌న్వీన‌ర్ వ‌ర ప్ర‌సాద్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కంభంపాటి కృష్ణ‌, మాజీ ఎమ్మెల్యే చిన్నం రామ‌కోట‌య్య‌, డాక్ట‌ర్ శీత‌ల్, త‌దిత‌రులు స‌న్మానించారు. ఈ సంద‌ర్భంగా ఆప్ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర ఇన్ ఛార్జి మ‌ణినాయుడు మాట్లాడుతూ, వ‌చ్చే ఎన్నికల‌కు ఏపీలో ఆమ్ ఆద్మీ పార్టీని సిద్ధం చేసి, సాధార‌ణ ఎన్నిక‌ల్లో స‌త్తా చూపించేలా తీర్చిదిద్దుతామ‌న్నారు. ఢిల్లీ త‌ర‌హాలో సుప‌రిపాల‌న అందించాల‌ని, పంజాబ్ లో ప్ర‌జ‌లు ఆప్ ని గెలిపించార‌ని, ఇపుడు ఆంధ్ర ప్ర‌దేశ్ కూడా త‌మ త‌ర్వాతి ప్రాధాన్యంలో ఉంద‌ని చెప్పారు. ఏపీలో పాల‌న ఎలా ఉందో, ఢిల్లీకి వ‌చ్చే ఆంధ్రా ప్ర‌జ‌లు త‌మ‌కు వివ‌రిస్తున్నార‌ని, ఇక్క‌డి అవినీతి అక్ర‌మాల‌ను ఊడ్చేసేందుకు చీపురు ఎంతో అవ‌స‌రం అని మ‌ణినాయుడు చెప్పారు. ఏపీలో జిల్లాల వారిగా కార్య‌క‌ర్త‌ల‌తో తాను విడివిడిగా స‌మావేశం ఏర్పాటు చేసి, ఆప్ ని గ్రామ‌స్థాయిలో, బూత్ లెవ‌ల్లో ప‌టిష్ఠం చేస్తామ‌న్నారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి క‌న్వీన‌ర్లు ఈ సమావేశంలో పాల్గొన‌గా, వారింద‌రితో మ‌ణినాయుడు ప్ర‌త్యేకంగా స‌మీక్ష నిర్వ‌హించారు. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో ఆప్ ఏపీలో గ‌ట్టి పోటీ ఇచ్చి తీరుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు. ఈ రోజుల్లో సినిమా హీరో మంగం శ్రీనివాస్ తో స‌హా ప‌లువురు ఆమ్ ఆద్మీ పార్టీ స‌భ్య‌త్వాన్ని తీసుకున్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *