Breaking News

కాలనీ వాసులు చెప్పిన సమస్యలపై సానుకూల స్పందన…

-కాలనీలో అడుగడుగునా తిరిగిన కలెక్టర్
-శాసన సభ్యులు జక్కంపూడి రాజా, కమిషనర్ దినేష్ కుమార్
-సమస్యలపై అవగాహన కోసం 63 నిమిషాలు కాలనీలోనే
– హౌసింగ్ బోర్డ్ కాలనీలో మౌలిక వసతులపై ప్రత్యేక కార్యాచరణ
-కాలనీ వాసులకు ఇండ్ల స్థలాలు కోసం స్థల పరిశీలన
-నామవరం, పుణ్య క్షేత్రం, జీ. ఎర్రంపాలెం ప్రాంతాల్లో స్టల పరిశీలన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ మురుగునీరు పారుదల , పారిశుధ్యం సమస్యకు పరిష్కారం చూపేందుకు , మోడల్ కాలనీగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత , శాసన సభ్యులు జక్కంపూడిరాజా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం లాలాచెరువు హౌసింగ్ బోర్డు స్పిన్నింగ్ మిల్లు కాలనీలో మునిసిపల్ కమిషనర్ దినేష్ కుమార్ తో కలిసి కలెక్టర్, శాసనసభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత అక్కడి ప్రజలతో మమేకమై వారి సమస్యలను ప్రత్యక్షంగా వినడమే కాకుండా సానుకూలంగా స్పందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ కాలనీలో చాలా వరకు రహదారి మార్గాలు సిమెంట్ రోడ్లు ఉన్నాయని, అయితే డ్రైనేజి వ్యవస్థ సరిగా లేకపోవడం గుర్తించామన్నారు. పారిశుధ్యం నిర్వహణ , దోమలు,పందులు సమస్య లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే కమీషనర్ ఆధ్వర్యంలో కాలనీ సమస్యల పరిష్కారం కోసం రూట్ మ్యాప్ సిద్దం చెయ్యడం జరుగుతుందన్నారు. మురుగునీటి పారుదల సౌకర్యం ప్రధాన డ్రైనేజ్ ని అనుసంధానం చేసి క్రమబద్దీకరణ చేస్తామని కలెక్టర్ తెలిపారు. కాలనీ వాసులు అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా ఆదర్శ కాలనీగా తీర్చిదిద్ద గలమన్నారు. రహదారులపై చెత్త వెయ్యకుండా మన ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా పారిశుధ్యం కోసం చిత్త శుద్ధితో ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లు లేని నిరుపేదలకు నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా త్వరలోనే అర్హులకు ఇంటి స్థలాలు మంజూరు చేస్తామన్నారు.

శాసన సభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ఈ కాలనీలో గత రెండు సంవత్సరాల కాలంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఇక్కడ సుమారు 1100 వందల మంది లబ్దిదారులు ఇళ్ళ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచన కి అనుగుణంగా జిల్లా కలెక్టర్ మాధవీలత , కాలనీల్లో పర్యటించి సమస్య పరిష్కారం కోసం చిత్త శుద్ధితో క్షేత్ర స్థాయిలో పర్యటించడం జరిగిందన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా స్వంత ఇళ్లను మంజూరు చేసేందుకు అనువైన ప్రాంతంలో స్థల సేకరణ చేసెందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గతంలో జక్కంపూడి రామ్మోహనరావు సమయంలో కాలనీలో అభివృద్ధి పనులు, రోడ్లు వెయ్యడం జరిగిందని, గత రెండు సంవత్సరాల నుంచి మరికొన్ని పనులు చేపట్టామన్నారు. కాలనీలో మురుగునీరు వ్యవస్థ సమస్య కోసం మునిసిపల్ కార్పొరేషన్ ద్వారా చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన తెలిపారు.

తొలుత ఉదయం 7 గంటలకు లాలా చెరువు కాలనీకి చేరుకున్న కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ కి శాసన సభ్యులు జక్కంపూడి రాజా సన్మానించారు. సుమారు కాలనీలోని ప్రధాన , శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని అంతర్గత రహదారుల్లో కలియ తిరిగిన అధికారుల బృందం ప్రతి చోట ప్రజలు చెప్పిన సమస్యలు ఓపికగా విన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోయినా గత 4 దశాబ్దాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, సుమారు 2500 పైగా కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయని పేర్కొన్నారు.

ఈ పర్యటన స్థానిక ప్రజా ప్రతినిధి జక్కంపూడి విజయలక్ష్మి కలెక్టర్ ను కలిసి సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపాలని కోరడం జరిగింది. లబ్ధిదారులకు ఇంటి స్థలాలు కోసం నామవరం, పుణ్య క్షేత్రం, జీ. ఎర్రంపాలెం గ్రామ ప్రాంతాల్లో స్టల పరిశీలన చెయ్యడం జరిగింది.

ఈ పర్యటనలో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఇంఛార్జి డి.పి.ఓ జె. సత్యనారాయణ, ఎమ్మార్వో కే. సుబ్రహ్మణ్యం , ఎం.పీ.డీ.వో ఎన్.వి.ఎస్ ఎస్ మూర్తి, మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ పాండురంగారావు ఆర్డబ్ల్యూఎస్ జె.ఇ సుబ్బారావు , మండల పంచాయితీ రాజ్ జె.ఈ. సంపత్ కుమార్, ఆర్ఎమ్. సి. అధికారులు, స్థానిక నాయకులు రాజనగరం జడ్పిటిసి వాసంశెట్టి పెద్ద వెంకన్న, గంగిశెట్టి సోమేశ్వర రావు, మందారపు వీర్రాజు, మెట్ల ఏసుపాదం, కె భాస్కర్ రావు, నాయుడు, జి. వెంకటేశ్వరరావు, అధికారులు , పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *