Breaking News

మచిలీపట్నం కార్పొరేషన్తోపాటు ముడ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి


-రు.1.50 కోట్ల అంచనా వ్యయంతో మచిలీపట్నంలో పార్కు అభివృద్ధికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  వై.శ్రీలక్ష్మి
-మోడల్ డివిజన్లుగా తీర్చి దిద్దుటకు సహకరిస్తాం.

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ముడ అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర పుర, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి అధికారులను ఆదేశించారు.

ఆంధ్ర ప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో పంచాయతీరాజ్ కాలనీలో రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్న శ్రీ యర్రా నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పార్క్ అభివృద్ధి పనులకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీ లక్ష్మి శనివారం జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, మాజీమంత్రి శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య నాని, నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, నగర కార్పోరేటర్ లతో కలిసి శంకుస్థాపన గావించారు.

వై శ్రీ లక్ష్మి ఐఏఎస్  బాల్యంలో మచిలీపట్నంలో విద్యనభ్యసించారని, మచిలీపట్నం పై మక్కువతో తన తండ్రి గారు కీర్తిశేషులు ఎర్ర నాగేశ్వరరావు పేరుతో పార్కు అభివృద్ధికి తమ సొంత నిధులు 5 లక్షలు పార్కు అభివృద్ధికి ఇచ్చారని మున్సిపల్ అధికారులు తెలిపారు. పార్క్ అభివృద్ధికి అయ్యే వ్యయంలో మున్సిపల్ నిధులు 29 లక్షలు కాగా, అమృత స్కీం నిధులు 22 లక్షలు, మొత్తం కోటిన్నరతో పార్క్అభివృద్ధి చేయనున్నారు. పార్కు చుట్టూ కాంపౌండ్ వాల్, పెద్ద గేటు తో సహా ప్రవేశద్వారం, గ్రీనరీ అభివృద్ధి, హైమాస్ట్ లైట్లతో విద్యుదీకరణ పనులు డ్రైనేజీ ఇరిగేషన్ సౌకర్యాలు, వాకింగ్ ట్రాక్, వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయనున్నారు.

అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో మున్సిపల్ అధికారులు, నగర కార్పొరేటర్ల తో జరిగిన సమావేశంలో వై శ్రీ లక్ష్మి నగరంలో వివిధ డివిజన్లలో శానిటేషన్ త్రాగునీరు సరఫరా పరిస్థితులపై ఆరా తీశారు. కార్పొరేటర్లు ఉదయాన్నే డివిజన్లలో పర్యటించి శానిటేషన్, తాగునీరు సరఫరా పర్యవేక్షించాలని సూచించారు. ప్రధాన రహదారుల డివైడర్స్ మొక్కలతో, సెంటర్ లైటింగ్ అభివృద్ధి చేయాలని ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని, నగరంలో అన్ని డివిజన్లు మోడల్ డివిజన్లుగా తీర్చుటకు సహకరిస్తామన్నారు. వర్షాకాలంలో ఆయా డివిజన్లలో ట్రీప్లాంటేషన్ చేయించాలని కార్పొరేటర్లకు సూచించారు.

మాజీమంత్రి శాసనసభ్యులు వెంకట్రామయ్య నాని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద నగరానికి చెందిన 16 వేల మంది లబ్ధిదారులకు కరగ్రహారంలో 312 ఎకరాల్లో ఒకే చోట అతిపెద్ద లేఅవుట్ వేసి స్థలాలు అందజేసినట్లు పేర్ని వివరించారు. ఈ లే అవుట్ లో ప్లాటింగ్ పూర్తిచేసి లబ్ధిదారులకు తమ ప్లాట్లు చూపించి జియో ట్యాగింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. టిడ్కో గృహాలు మౌలిక వసతుల అభివృద్ధి పనులు జ, త్వరలో లబ్ధిదారులకు అందజేయనున్నట్లు, నగరాభివృద్ధిలో సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏపీ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవిత, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *