-బట్రాజు సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన చంద్రకళకు కృష్ణయ్య అభినందనలు
-సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేసిన చంద్రకళ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీల సంక్షేమం కోసం నిరంతం పోరాటం చేసే ఆర్ కృష్ణయ్యను ఏపీ ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయడం ఎంతో హర్షించదగిన విషయమని ఏపీ బట్రాజు సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పాలగిరి చంద్రకళ తెలిపారు. కృష్టయ్యను రాజ్యసభకు ఎంపిక చేసిన అనంతరం ఆయనను బుధవారం కలిసిన పాలగిరి చంద్రకళ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం కృష్ణయ్య కూడా బట్రాజు సంఘానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనందుకు ఆమెను అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం స్థాపించి వసతి గృహాలు, బోధనా రుసుములు, ఉపకారవేతనాలు, సమస్యలు, ఖాళీల భర్తీ లు, నిరుద్యోగులకు వయోపరిమితి విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు కోసం, బీసీల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసిన యోధుడు ఆర్. కృష్ణయ్య అని అటువంటి యోధున్ని గుర్తించి తన, పర, ప్రాంతంతో సంబంధం లేకుండా రాజ్యసభ స్థానానికి నామినేట్ చేసి అసలు సిసలైన ఉద్యమకారున్ని రాజ్యసభకు పంపడం వల్ల భారతదేశంలోనీ బడుగు, బలహీన వర్గాలకు మరింత ఉత్సాహాన్ని నింపిన వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యత వెలకట్టలేనిదన్నారు. రాజ్యసభకు నూతనంగా ఎంపికైన ఆర్ .కృష్ణయ్య నాయకత్వంలో పార్లమెంటులో బీసీల బిల్లు ప్రవేశపెట్టడానికి కృష్ణయ్యకు లభించిన (ఎంపీ)రాజ్యసభ పదవి ఎంతగానో దోహదపడు తుందన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో “జాతీయ ప్రధాన కార్యదర్శి” గా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర “భట్ రాజు” సంఘం మహిళా అధ్యక్షురాలిగా “మహిళా పక్షపాతి” అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి రెండు తెలుగు రాష్ట్రాల్లోని బీసీల తరఫున చంద్రకళ కృతజ్ఞతలు తెలియజేశారు.