-వ్యవస్థలో సంస్థా గత నిర్మాణం పై దృష్టి పెట్టండి..
-ఈరోజు స్పందనలో 29 దరఖాస్తులు అందాయి
-రూడా పరిధిలో స్పందనకి ఒకే ఫిర్యాదు
-కె. దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డ్రైయిన్ , రహదారులు, పారిశుధ్య నిర్వహణపై ప్రజల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్ , రూడా వైస్ చైర్మన్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, స్పందనలో ఈరోజు ప్రజల నుంచి 29 ఫిర్యాదులు, రూడా పరిధిలో ఒక ఫిర్యాదు అందాయన్నారు. రూడా కి సంబంధించి భూ మార్పిడి కోరుతూ ధరకాస్తు వచ్చిందని తెలిపారు. స్పందన లో వొచ్చిన ఫిర్యాదుల్లో పారిశుధ్యం, రహదారుల నిర్వహణ, డ్రెయిన్లు కి సంబంధించి నిర్వహణ లోపం పై ప్రజలు కార్పొరేషన్ కి వొచ్చి ఫిర్యాదు చేసేలా ఉంటే , మీ పని సామర్థ్యం ఏమిటో తెలుస్తుందని, ప్రజా సమస్యలపై అవగాహన ఉండి మీరే పరిష్కారం చూపితే వారు ఇక్కడి వరకు వొచ్చే పరిస్థితి ఉండదన్నారు. ప్రతీ ఫిర్యాదుకి సంబంధించిన సమస్య పరిష్కా రం కోసం ప్రత్యేక దృష్టి చూపాలని, అందుకు ఒకరిని బాధ్యులుగా నియమించాలని పేర్కొన్నారు. ఒకసారి వొచ్చిన ఫిర్యాదు పునవృతం కాకుండా చూసుకోవాలని, ఇందుకోసం నిర్దుష్టమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా సంస్థా గత నిర్మాణం అవసరం అని దినేష్ కుమార్ స్పష్టం చేశారు.. అనర్హులకు పథకాలు అమలు సాధ్యం కాదని, అర్హులకు సంబంధించిన విభాగాల అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని , సిబ్బందికి తగిన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు అర్హులకు సమస్య పరిష్కారం చూపేలా నిర్ణయం తీసుకోవాలన్నారు. స్పందన కార్యక్రమం సంబంధించిన నగర పాలక సంస్థ అధికారులు,అదనపు మునిసిపల్ కమీషనర్ పి. వి. సత్యవేణి, ఇంజనీరింగ్ ఇతర అధికారులు పాండురంగారావు, సూరజ్ కుమార్, డా.వినూత్న, , వార్డు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.