అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని వివిధ రైతు బజారులు,రిటైల్ మార్కెట్లో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల స్థితిగతులను ఎప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు వీలుగా వారం రోజుల్లోగా ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వెల్లడించారు.ఈమేరకు మంగళవారం అమరావతి సచివాలయం నుండి వివిధ నిత్యావసర వస్తువులు,కూరగాయల ధరల సిత్థిగతులపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రైతు బజారుల్లో వివిధ రకాల కూరగాయలు,వంటనూనెలు సహా ఇతర నిత్యావసర సరుకులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్,ఆయిల్ ఫెడ్,రైతు బజారుల సిఇఓ తదితర శాఖల అధికారులను ఆదేశించారు.ప్రస్తుతం ధరల నియంత్రణ పర్యవేక్షణకు సంబంధించి పౌరసరఫరాలు,మార్కెటింగ్,విజెలెన్సు అండ్ ఎన్పోర్సుమెంట్,రైతు బజారుల సిఇఓ తదితర విభాగాల వద్ద పలు డాష్ బోర్డులు ద్వారా మానిటర్ చేస్తున్నారని అవన్నీ ఒకే సింగిల్ విధానం ద్వారా పర్యవేక్షణకు వీలుగా ఒక ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తేనున్నట్టు సిఎస్ డా.సమీర్ శర్మ పేర్కొన్నారు.ఆదిశగా ఇప్పటికే డైరెక్టర్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్,మార్కెటింగ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారని వారం రోజుల్లోగా ఈప్రత్యేక యాప్ ను అందుబాటులోకి రానుందని సిఎస్ పేర్కొన్నారు.ఈయాప్ లో వివిధ రైతు బజారుల్లో నిత్యావసర సరకుల సరఫరా స్టాకు లభ్యత,వాటి ధరల వివరాలను మార్కెటింగ్, పౌరసరఫరాలు, తూనికలు కొలతులు,సెర్ప్,విజిలెన్సు అండ్ ఎన్పోర్సుమెంట్ సహా సంబంధిత శాఖలు తెల్సుకునుని నిరంతరం పర్యవేక్షించేందుకు అవకాశం కలుగుతుందని సిఎస్ పేర్కొన్నారు.
వీడియో లింక్ ద్వారా ఈసమావేశంలో పాల్గొన్న రైతు బజారుల సిఇఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోని రైతు బజారు,బయట బహిరంగ మార్కెట్లలో 30వ తేదీ సోమవారం అందుబాటులో ఉన్న ధరల వివరాలను సిఎస్ కు వివరించారు.అవి శ్రీకాకుళం జిల్లాలోని రైతు బజారుల్లో కిలో టమాటా 64రూ.లుగా ఉండగా రిటైల్ మార్కెట్లో 80 రూ.లుగా ఉందని తెలిపారు.అలాగే విజయనగరం రైతు బజారుల్లో 60 రూ.లు,రైటల్ 85 రూ.లు,విశాఖపట్నం జిల్లాల్లో రైతు బజారుల్లో 64 రూ.లు,రిటైల్ 90 రూ.లు,తూర్పు గోదావరి రైతు జారుల్లో 60 రూ.లు,రిటైల్ 100 రూ.లుగా ఉందని చెప్పారు.అలాగే పశ్చిమ గోదావరి రైతు బజారుల్లో 72 రూ.లు,రైటైల్ మార్కెట్లో 80 రూ.లు,విజయవాడ రైతు బజారుల్లో 60 రూ.లు,రిటైల్ 65 రూ.లు,గుంటూరు రైతు బజారులు 60 రూ.లు,రిటైల్ 90 రూ.లు కాగా ఒంగోలు రైతు బజారుల్లో కిలో టమాటా 67 రూ.లు,రిటైల్ 80 రూ.లుగా ధర ఉందని వివరించారు.అదే విధంగా చిత్తూరు రైతు బజారుల్లో కిలో 80 రూ.లు కాగా రిటైల్ మార్కెట్లో 90 రూ.లు,కడప రైతు బజారుల్లో 68 రూ.లు,రిటైల్ 70 రూ.లు,అనంతపురం రైతు బజారుల్లో 60 రూ.లు,రిటైల్ 65 రూ.లు ఉండగా కర్నూల్ జిల్లాలోని రైతు బజారులో టమాటా కిలో 68 రూ.లు ఉండగా బయట రిటైల్ మార్కెట్లో కిలో 72 రూ.లుగా ఉందని రైతు బజారుల సిఇఓ సిఎస్ కు వివరించారు.అలాగే ఇతర కూరగాయలు కూడా రిటైల్ మార్కెట్ కంటే తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంచడం జరుగుతోందని వివరించారు.
కాగా గత ఫిబ్రవరి 28 నుండి ఇప్పటి వరకూ తూనికలు కొలతలు,విజిలెన్స్ అండ్ ఎన్పోర్సుమెంట్,పౌరసరఫరాల శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వంటనూనెలను అధిక ధరలకు విక్రయించడం ఇతర అక్రమాలకు సంబంధించి 2వేల 166 కేసులు నమోదు చేశారు.వాటిలో 1798 కేసులు కేవలం వంటనూనెల ధరలు నిర్దేశిత ఎంఆర్పికంటే అధకంగా విక్రయించినవే ఉండగా మిగతా 368 కేసులు తూనికలు కొలతల చట్టం మరియు అందుకు సంబంధించిన నియమనింబధనల ఉల్లంఘటనకు సంబంధించి నమైదయ్యాయి.858 కేసుల్లో మొత్తం 56 లక్షల రూ.లు కాంపౌండింగ్ ఫీజు విధించారు.
వీడియో లింక్ ద్వారా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఇఓ కార్యదర్శి గిరిజా శంకర్, మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న,డిజి విజిలెన్సు అండ్ ఎన్పోర్సుమెంట్ డా.శంక బార్త, ఆయిల్ ఫెడ్ తదితర శాఖల ఝఅధికారులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …