-డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ ను సందర్శించిన నగర మేయర్, శాసన సభ్యులు మరియు శాసన మండలి సభ్యులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నియోజకవర్గoలో గడపగడపకు పర్యటించిన సందర్భంలో డివిజన్ ప్రజలు మరియు కొండ ప్రాంత వాసులు మంచినీటి సరఫరాకు సంబందించి త్రాగునీరు రంగు మారుట మరియు వాసన వస్తుందని తెలిపిన సమస్యలపై స్పందిస్తూ, శనివారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు యం.డి రహుల్లా తదితరులు భవానిపురం డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ ను సందర్శించారు. వేసవిలో ప్రజలకు ఏవిధమైన నీటి కొరత లేకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ, వాటర్ పైప్ లైన్ లలో గుర్తించిన లీకేజిలకు యుద్దప్రాతిపదికన తగిన మరమ్మతులు చేపట్టి త్రాగునీరు వృధా కాకుండా చూడాలని సంబందిత అధికారులకు సూచించారు. రిజర్వాయర్లకు రక్షిత నీటి సరఫరా విధానముపై పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని మరియు శివారు ప్రాంత వాసులకు కూడా రక్షిత నీటి సరఫరా అందించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. హెడ్ వాటర్ వర్క్స్ నందలి స్కాడా సిస్టమ్ పనితీరు, ఫిల్టరైజేషన్ ప్లాంట్లు, ఇన్ టెక్ వెల్ ద్వారా రా వాటర్ సేకరణ మరియు ప్లాంట్ల యొక్క నిర్వహణ విధానము పరిశీలించి నీటిలో టేర్భిడిటి మరియు క్లోరినేషన్ ఎంత పరిమాణంలో కలుపుతున్నది మొదలగు అంశాలను అధికారులను అడిగితెలుసుకొన్నారు. ప్రజలకు అందించు మంచినీటి సరఫరా విషయంలో అత్యంత అప్రమ్మతంగా ఉండాలని, ప్రజలకు త్రాగునీటి సరఫరా వేళల విషయమై ముందస్తు సమాచారం అందించవలెనని అధికారులు సూచించారు. పర్యటనలో పలువురు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.