-13,785 మంది అభ్యర్థులకు గాను పేపర్`1కు 6,468, పేపర్`2కు 6,396 మంది హాజరు..
-58 మంది విభిన్న ప్రతిభావంతులకు గాను 29 మంది హాజరు..
-33 కేంద్రాల ద్వారా పరీక్షల నిర్వహణ..
-విధులు నిర్వర్తించిన 1,332 మంది ఇన్విజిలేటర్లు, 33 మంది వెన్యూ సూరర్వైజర్లు, 94 మంది అసిస్టెంట్ వెన్యూ సూపర్వైజర్లు.
-కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ.
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్‌యస్ డిల్లీరావు అన్నారు. నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాల, లయోలా ఇంజనీరింగ్ కాళాశాల, సిద్ధార్థ మహిళ కళాశాల, బిషప్ అజయర్య జానియర్ కళాశాల పరీక్షా కేంద్రాలను ఆదివారం కలెక్టర్ యస్ డిల్లీరావు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 13,785 మంది అభ్యర్థులకుగాను గాను ఉదయం పేపర్`1కు 6,468, మధ్యాహ్నం పేపర్`2 కు 6,396 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 33 పరీక్షా కేంద్రాలలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించామని, పడమట కెబిసి జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్‌లో 29 మంది విభిన్న ప్రతిభావంతులు పరీక్ష వ్రాసారని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్ష నిర్వహణను పర్యవేక్షించామన్నారు. పరీక్షలకు నియమించిన 1,332 మంది ఇన్విజిలేటర్లు, 33 మంది వెన్యూ సూపర్వైజర్లు, 94అసిస్టెంట్ సూపర్వైజర్లు సమన్వయంతో పరీక్షలను విజయవంతంగా నిర్వహించారన్నారు. అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా సజావుగా సక్రమంగా ప్రశాంతంగా ప్రిలిమినరి పరీక్షననఱు నిర్వహించిన అధికారులను, సిబ్బందిని కలెక్టర్ డిల్లీరావు అభినందనలు తెలిపారు. పరీక్షల ఓవరాల్ ఇన్‌స్పెక్టింగ్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్, కస్టోడియన్ అధికారిగా వ్వవహరించిన డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, పరీక్షల నిర్వహణను ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా డిప్యూటి తహాశీల్థార్ మధుబాబు పర్యవేక్షించారు.
పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ :
నగరంలోని వన్‌టౌన్ గాంధీజీ మహిళా కళాశాల, పడమట భాష్యం హైస్కూల్‌లోని పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ పరిశీలించారు.