విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని మరో ముప్పైఏళ్లు ముఖ్యమంత్రి గా కొనసాగే విధంగా ప్రజలు దీవించాలని తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 11వ డివిజన్ 5వ సచివాలయ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీ నందు స్థానిక డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని పవన్(బాబీ) తో కలిసి తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఇంటి ఇంటి కి వెళ్లి ప్రజలకు అందే సంక్షేమ పథకాలు లబ్దిదారులకు వివరించి, అదేవిధంగా స్థానిక ప్రజల సమస్యలు ను సంబంధిత సచివాలయం సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు ద్వారా వివరాలు తెలుసుకుని సాధ్యమయినంత త్వరలో పరిష్కరించి వారికి అందేలా చర్యలు చేపట్టాలని అవినాష్ కోరారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ప్రజలు వద్దకు వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని, సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పధకాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే చేరుస్తున్న ఘనత జగన్ సొంతం అని, ప్రజలలో తిరుగుతున్న అవినాష్ ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో పరిష్కరానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.కొన్ని డివిజన్లలో ఓడిపోయిన సరే మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ప్రతి పనిని వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం.మాకు ఓటు బ్యాంకు రాజకీయాలు కాదు అభివృద్ధి ముఖ్యం. తెలుగుదేశం ప్రభుత్వం లో ఓడిపోయిన నియోజకవర్గలను, డివిజిన్ల ను పట్టించుకోనేవారి కాదు అని, కానీ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఏదైనా డివిజన్ లో ఓడిపోయిన సరే పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,11వ డివిజన్ ఇంచార్జ్ పర్వతనేని బాబీ, 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతి, వైస్సార్సీపీ నాయకులు సందీప్ రెడ్డి, చోటు, లక్ష్మి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
2024లో కూటమి ప్రభుత్వానికి ప్రజలు చారిత్రక విజయం ఇచ్చారు
-సూపర్-6 హామీలు కచ్చితంగా అమలు చేస్తాం -ఐదేళ్ల పాటు గత పాలకులు అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారు -గత ప్రభుత్వ …