-స్పందనలో 110 ఆర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ప్రజల నుండి110 ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఎంతో నమ్మకంతో ఆర్జీలను సమర్పిస్తారన్నారు. అధికారులు ఆర్జీలను నిశితంగా పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. తిరిగి మరల వస్తున్న ఆర్జీలపై సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఆర్జీలు తొలి దశలోనే నాణ్యతతో పరిష్కారం చూపితే , తద్వారా మరోమారు ఆర్జీ తిరిగి నమోదు కాదన్నారు. సంబంధిత ఆర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హతనుబట్టి పరిష్కారం చేయాలన్నారు. పెండిరగ్, బియాండ్ ఎస్‌ఎల్‌ఏ, రీఒపెన్ కాకుండా ఆర్జీలను సమర్థవంతంగా పరిష్కరించాలన్నారు. నూరు శాతం సంతృప్తి చెందేలా నాణ్యతతో ఆర్జీకి పరిష్కారం చూపాలని కలెక్టర్ అన్నారు. సింగ్‌నగర్‌కు చెందిన షేక్ కౌజర్ ఆర్జీ ఇస్తూ తాను విభిన్నప్రతిభావంతురాలునని గతంలో మీసేవా కేంద్రంలో పనిచేసిన అనుభవం ఉందని ప్రస్తుతం కష్టాలలో ఉన్న తనకు ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కలెక్టర్‌ను కోరారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ కుమార్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.