Breaking News

10వ తరగతి ఫలితాల్లో 78.30 శాతం ఉత్తీర్ణతతో సాధించి ప్రకాశం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది..

-4,14,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా బాలురు కంటే బాలికలు ఎక్కువ శాతం ఉత్తీర్ణత..
-797 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి..
-ఫెయిల్ అయిన విద్యార్థులకు జులై 6 నుండి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహణ..
-సప్లిమెంటరీ పరీక్షలకు జూన్ 7 నుండి ఫీజుల చెల్లింపు ప్రారంభం..
-పాఠశాల గడువు తేదీ కంటే ముందు తెరిచినా, తరగతులు ప్రారంభించినా చర్యలు తీసుకుంటాం..
-రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 78.30 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రకాశం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
విజయవాడ గేట్ వే వివంత హోటల్ లో సోమవారం ఎస్.ఎస్.సి. పరీక్షా ఫలితాలను మంత్రి విడుదల చేసారు. ఈ సందర్భంగా విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 6 లక్షల 15 వేల 908 మంది పరీక్షకు హాజరు కాగా వారిలో 67.26% తో 4 లక్షల 14 వేల 281 మంది ఉత్తీర్ణత సాధించారని మంత్రి అన్నారు. వారిలో 64.02% బాలురు కాగా మిగిలిన 70.70% బాలికలు ఉత్తీర్ణులైనారని మంత్రి అన్నారు. ఈ సంవత్సరం 797 పాఠశాలల్లో నూరు శాతం పరీక్షా ఫలితాలు సాధించామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ గురుకుల పాఠశాలలు 91.10% తో ఉత్తీర్ణతలో రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచాయని మంత్రి అన్నారు. ఒక్క విద్యార్థి కూడా పాస్ కాని పాఠశాలలు 71 కాగా వాటిలో 13 ప్రైవేట్ పాఠశాలలు 18 జిల్లా పరిషత్ పాఠశాలలు, 18 ఎయిడెడ్ పాఠశాలలు, 2 గవర్నమెంట్ పాఠశాలలు, ట్రైబల్ పాఠశాల ఒకటి, ఆశ్రమ పాఠశాల ఒకటి ఉన్నాయని మంత్రి వివరించారు.
10వ తరగతి పరీక్షా ఫలితాల వివరాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కార్యాలయ వెబ్ సైట్ www.bse.ap.gov.in నందు పొందగలరని దీనికి సంబందించిన పాస్ వర్డ్ Nadu.Nedu@2022 అని తెలిపారు. పరీక్షలో ఉత్తీర్ణత తగ్గడానికి కారణాలు ప్రభుత్వం విశ్లేషిస్తుందని కోవిడ్ తరువాత కూడా సరిగా పాఠశాలలను నడపక పోవడం వల్లే ఈసారి ఉత్తీర్ణతా శాతం తగ్గిందని మంత్రి తెలిపారు. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కల్పించడమే ప్రభుత్వ ద్యేయమని, ఈదిశగా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని అన్నారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 28 రోజులలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేశామని విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా మాట్లాడాలని మంత్రి అన్నారు.
ఏప్రిల్ 27వ తేదీ నుండి మే 9వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించామని మే 13 నుండి 22 వరకు స్పాట్ వాల్యూయేషన్ చేశామని మొత్తం 6,15,908 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారని వారిలో 2,02,821 మంది బాలురు, 2,11,460 మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారన్నారు. మొత్తం 11,671 మంది పాఠశాలల విద్యార్థులు పరీక్షలు వ్రాయగా 797 పాఠశాలలలో 100% ఉత్తీర్ణత సాధించారని మంత్రి అన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కొరకు జులై 6 నుండి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారని, ఇందుకు సంబంధించి ఈ నెల 13 నుండి ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు జూన్ 7వ తేదీ నుండి ఫీజు చెల్లింపులు ప్రారంభమవుతున్నాయని పరీక్షల అనంతరం ఫలితాలు త్వరగా విడుదల చేసి రెగ్యులర్ విద్యార్థులతో పాటు సప్లిమెంటరీ విద్యార్థులకు కూడా చదువుకునే అవకాశం కల్పిస్తామన్నారు. మార్కుల జాబితాలలో గ్రేడింగ్ లేదని, మార్కుల జాబితాలు ప్రధమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, పాస్ మార్కులు అందిస్తారని మంత్రి అన్నారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలపై ఎవరూ ప్రకటనలు ఇవ్వరాదని, విద్యను విద్య లాగే కొనసాగించాలని, వ్యాపారం చేయకూడదని మంత్రి అన్నారు. విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే సమాధాన పత్రాలు ఇస్తామని, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం 15 రోజుల లోపుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గడువు తేదీ కంటే ముందే పాఠశాలలు తెరిచినా, తరగతులు ప్రారంభించినా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. పరీక్షలలో మాల్ ప్రాక్టీస్ వ్యవహారంపై 80 మందిని కస్టడీ లోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖా కమిషనర్ ఎస్. సురేష్ కుమార్, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు డి. దేవానంద రెడ్డి పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *