-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అమ్మఒడి పథకంలో ఎదురయ్యే సమస్యలపై పున:పరిశీలన చేసి అర్హుత ఉన్న ఏ ఒక్కరూ అమ్మఒడి పథకంవల్ల తమకు లబ్ది చేకూరలేదనే పిర్యాదు రానీయరాదని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు విద్యా శాఖాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అమ్మఒడి పథకం అమలలో ఎదురవుతున్న సమస్యలపై డిఇవో, మండల విద్యా శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 607 గ్రామ సచివాలయాలలో 1,74,884 విద్యార్థులు ఉండగా, అర్హతను నిర్థారించే అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలన చేసి అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి అమ్మఒడి పథకాన్ని వర్తింప చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇకెవైసి (డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఎల్జ్‌బుల్టీ) అన్‌లైన్‌లో నమోదైన 1,61,945 మంది ఉండగా, అర్హత నిర్థారించే మిగిలిన 12,939 మందికి సంబంధించిన డేటాను పున:పరిశీలన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. దీనిలో ఎదురయ్యే సమస్యలను సుదీర్ఘంగా పరిశీలించి పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ తమకు అమ్మఒడి పథకం అదలేదనే పిర్యాదు రానీయరాదని కలెక్టర్ అన్నారు. నాడు`నేడు పనులలో భాగంగా పాఠశాలలో మౌలిక వసతుల అభివృద్ధిపై మండల స్థాయిలో సంబంధిత డేటాను సిద్దం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖాధికారి సి.వి. రేణుక, యంఇవోలు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్ గ్రామీణ నీటిసరఫరా శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్…
గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్ శాఖలలో జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు పంచాయతీరాజ్ గ్రామీణ నీటిసరఫరా శాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఏజెన్సీల ఎంపికను తుది ఖరారు చేయాలని పంచాయతీ రాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. ఈనెల 9వ తేదీ జిల్లా వ్యాప్తంగా పూర్తి కాని ప్రభుత్వ భవనాలకు మోగా గ్రౌండిరగ్ మేళా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని దీనిలో భాగంగా ఆయా శాఖాధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. చేపట్టవలసిన భవన నిర్మాణ పనులకు అప్పగించిన ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని, ఇప్పటికే చేపట్టిన పనులు వేగవంతం చేయడం, ఇంకనూ ప్రారంభం కాని పనులు తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్థేశించిన గడువులోగా భవన నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.