Breaking News

నోటిఫికేషన్ ననుసరించి స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారి G.O.Ms.No.59 MA & UD (UBS) డిపార్టుమెంటు, తేది.10.02.2010 నందు జారీ చేయబడిన ఉత్తర్వుల ననుసరించి మరియు గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ చట్టము 1955 సెక్షన్ 93 సబ్ సెక్షన్ 1 లొ నిర్వచించబడిన ప్రకారము విజయవాడ నగరపాలక సంస్థకు స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవీ కాలము ది.24-06-2022వ తేదీతో ముగియుచున్నందున, నూతన స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేయుటకు అర్హత కలిగిన వ్యక్తుల (కార్పొరేటర్లు) నుండి దరఖాస్తులు ఆహ్వానించుచూ నోటిఫికేషన్ విడుదల చేయటమైనదని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, ఈ ప్రకటన ద్వారా తెలియజేశారు.

సదరు నోటిఫికేషన్ ననుసరించి స్టాండింగ్ కమిటీ ఎన్నికల షెడ్యూలు– 2022 క్రింది విధంగా కలదు.
ఓటర్ల లిస్టు పబ్లికేషను : 16.06.2022
ఎలక్షన్ నోటిసు పబ్లికేషను : 16.06.2022
నామినేషన్లు వేయుట : 16.06.2022 నుండి 24.06.2022
(ఉదయం11.00 గం.ల నుండి 03.00 గం.ల వరకు)
అదనపు కమిషనర్ (జనరల్) ఛాంబర్ నందు
నామినేషన్ల లిస్టు పబ్లికేషన్ : 24.06.2022
నామినేషన్ల స్క్రూటినీ : 25.06.2022
(ఉదయం11.00 గం.ల నుండి 12.00 గం.ల వరకు)
అర్హత గల నామినేషన్లలిస్టు పబ్లికేషన్ : 25.06.2022
నామినేషన్ల ఉపసంహరణ : 29.06.2022 (12.00 Noon TO 03.00 PM)
ఎన్నికలో వున్నఅభ్యర్ధుల లిస్టు పబ్లికేషన్ : 29.06.2022
ఎన్నిక తేదీ : 02.07.2022 (ఉదయం10.30 గం.ల నుండి మధ్యాహ్నం3.00 గంటల వరకు కౌన్సిల్ హాల్ నందు)
ఓట్ల లెక్కింపు : 02.07.2022 (మధ్యాహ్నం3.00 గంటల తరువాత)
గెలిచిన అభ్యర్ధుల పేర్లు ప్రకటన : 02.07.2022 (3.00 గంటల తరువాత)

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *