Breaking News

రూ.48 లక్షలతో “సామర్థ్య నిర్మాణ కేంద్రం”…

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
శాస్త్రీయ సాంకేతిక సాధనాల ద్వారా పశువులలో పునరుత్పత్తి, పశువులకు నాణ్యమైన దాణా లభ్యత, పశువులకు మెరుగైన ఆరోగ్య నిర్వహణ అందించే దిశలో శాశ్వత సంస్థాగత భవన నిర్మాణం పనులు చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర హోం మంత్రి డా. తానేటి వనిత పేర్కొన్నారు. బుధవారం ఉదయం కొవ్వూరు ప్రాంతీయ పశు వైద్యశాల ప్రాగణంలో రూ.48 లక్షలతో నిర్మించే “సామర్థ్య నిర్మాణ కేంద్రం” భవన నిర్మాణ పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. తానేటి వనిత మాట్లాడుతూ, పశు ఆధారిత ఉత్పత్తులపై ఆధారపడి జీవించే వారి జీవితాలలో వెలుగు నింపే లక్ష్యంగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పశువులు, అనుబంధ రంగాలకు చేదోడుగా ఉండడం జరుగుతోందన్నారు. పశు, అనుబంధ సంపదపై ఆధారపడే పశుపోషకులకి  అవసరమైన సాంకేతిక విజ్ఞానాన్ని పశుసంవర్ధక శాఖ నిరంతరం అందిస్తోందన్నారు. ప్రజలకు 104, 108 తరహాలో అంబులెన్స్ సేవలు అందించే విధానం తరహాలోనే డా.వై ఎస్ ఆర్ సంచార పశు వైద్య సేవా పథకం ప్రారంభించడం ద్వారా ప్రతి నియోజక వర్గంలో ఒక అంబులెన్స్ సేవలు అందుబాటులో కి తీసుకుని వచ్చామన్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (RKVY) పథకం/ వ్యవసాయం మరియు అనుబంధ రంగ పునరుజ్జీవనం (RAFTAAR) కోసం వేతన విధానాల నిధుల రూ.48 లక్షలతో భవన నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు. నిర్మాణ పనులను పోలీస్ హౌసింగ్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఆ భవన సముదాయంలో సామర్థ్య నిర్మాణ కేంద్రం ఏర్పాటు చేసి పశు పోషకులకు సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. పశువులలో పునరుత్పత్తి, పశువులకు నాణ్యమైన దాణా లభ్యత, పశువులకు మెరుగైన ఆరోగ్య నిర్వహణ అందించే క్రమంలో పశుపోషకులకి  అవసరమైన సాంకేతిక విజ్ఞానం ఈ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకుని రావడం ధ్యేయంగా పనిచెయ్యడం జరుగుతుందని పేర్కొన్నారు. తొలుత ప్రాంగణానికి చేరుకున్న మంత్రి భూమి పూజ నిర్వహించి భవన నిర్మాణం పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం శిలా ఫలకం ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమం లో మునిసిపల్ చైర్ పర్సన్ బావన రత్నకుమారి, ఎంపిపి కాకర్ల నారాయుడు, వైస్ చైర్ పర్సన్లు మన్నేపద్మ గండ్రోతు అంజలిదేవి , జిల్లా పశు సంవర్ధక అధికారి ఎస్ టి జి సత్య గోవింద్, డ్వామా పీడీ పీ.జగదంబ, తహశీల్దార్ బి నాగరాజు నాయక్ , స్థానిక కౌన్సిలర్ కె. రమేష్ బాబు, ఆర్. భాస్కరరావు, ఏ హెచ్ .. ఏ డీ ఏ.వెంకట రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులకు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *