తాళ్లపూడి (తాడిపూడి ), నేటి పత్రిక ప్రజావార్త :
రైతు భాందవుడుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పాలిట వ్యవసాయాన్ని పండుగగా చెయ్యడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం సాయంత్రం తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద ఖరీఫ్ సాగు కోసం 1,57,000 ఎకరాలకు పైగా ఆయకట్టు కు మంత్రి సాగునీటిని విడుదల చేసారు. తొలుత గోదావరి నదికి పూజలు నిర్వహించి, లిఫ్ట్ ఇరిగేషన్ పంపు బటన్ నొక్కి నీటిని విడుదలచేశారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అండగా మన ప్రభుత్వం నిలిచిందన్నారు. రెండు దశాబ్దాల తరువాత ఖరీఫ్ సీజన్లో జూన్ నెలలో సాగునీరు అందించడం జరుగుతోందన్నరు. తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద 13.45 టి ఎం సి నీటిని వినియోగించు కోవడం జరుగుతోందన్నారు. ఖరీఫ్ కంటే ముందుగా రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందించామని , గత ఖరీఫ్ సీజన్లో నష్ట పోయిన పంటకు ఉచిత బీమా పథకం నష్ట పరిహారం వారి ఖాతాల్లో జమ చేసి, వారికి భరోసాగా నిలుస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ, సంక్షేమ పాలనను అందించడం జరుగుతోందని మంత్రి తెలిపారు. తాడిపూడి ఎత్తిపోతల పథకం ఎడమ కాలువ కింద 14 మండలాల్లోని 135 గ్రామాల పరిధిలోని 2,06,600 ఎకరాల ఆయకట్టు కు సాగునీటి అందించాలనే లక్ష్యంగా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ ఖరీఫ్ సీజన్లో 1,57,544 ఎకరాల ఆయకట్టు కు ముందస్తుగా సాగునీరు అందించడం ద్వారా నవంబర్, డిసెంబర్ నెలలో వచ్చే ప్రకృతి వైపరీత్యాలు నుంచి పంటను కాపాడుకునేందుకు అవకాశం ఏర్పడిందని తెలిపారు. ఈ ప్రభుత్వం రైతు పక్ష పాత ప్రభుత్వం అని, ఆర్బికే ల ద్వారా ఎరువులు, విత్తనాలు అందించి అండగా నిలుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ ఛైర్ పర్సన్ పోసిన శ్రీలేఖ, యం. పి. పి. జొన్నకూటి పోసిరాజు, ఎస్. ఇ., బి.శ్యాంప్రసాద్, ఈ ఈ డి. ఏసుబాబు, డి.ఈ పి. ధనుంజయ, ఎంపీడీఓ యం.రాజశేఖర్, తహశీల్దార్ శర శాంతి, స్థానిక నాయకులు కాకర్ల వెంకటేస్వర రరావు, పోసిన శ్రీకృష్ణ దేవరాయులు,యం. పి. టి. సీలు, సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …