సీతానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రెవెన్యూ గ్రామాల్లో కౌలు చేసే రైతుల సాగు విస్తీర్ణం ఆధారంగా డేటా సేకరణ చేపట్టాల్సి ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ స్పష్టం చేశారు. బుధవారం సీతానగరం మండలం కాటవరం గ్రామ సచివాలయంలో మండల వ్యవసాయ , అధికారులు, సంబందించిన సిబ్బంది తో సి సి ఎల్ కార్డ్ లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమి, సాగు చేస్తున్న భూమి వివరాలను నిర్దుష్టంగా అందుబాటులో ఉన్నాయన్నారు. సమగ్రంగా సాగు చేస్తున్న యజమానులు పట్టాదారు ఆధారంగా, కౌలు రైతుల వివరాలు రెవెన్యూ గ్రామాల వారీగా సేకరించాలని ఆదేశించారు. స్వంత భూ యజమానులు, కౌలు రైతుల వారీగా సాగు వివరాలపై నిర్దుష్టమైన సంఖ్య కి చేరుకోవాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. ఇందుకోసం క్షేత్ర స్థాయి అధికారులకు, సిబ్బందికి సూచనలు చెయ్యడం జరిగిందని, అందుకు అనుగుణంగా కౌలు భూమి, సాగుచేసే కౌలుదారుని వివరాలు సరిపోవాలన్నారు. నూటికి 80 శాతం పైగా భూములను కౌలు రైతులు సాగు చేస్తారన్నది వాస్తవం అన్నారు. అందుకు అనుగుణంగా డేటా సేకరణ చెయ్యాల్సి ఉంటుందన్నారు. అటువంటి కౌలు రైతులకు సి సి ఆర్ సి (క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డ్ ) అందచేయ్యాల్సి ఉందన్నారు. అయితే కొన్ని గ్రామాల్లో భూ యజమానులే వ్యవసాయం చేస్తున్నట్లు చూపించడం తన దృష్టికి వచ్చిందన్నారు. వాస్తవ డేటా కి అనుగుణంగా వివరాలు ఉండాలని , అందులో ఉద్దేశ్య పూర్వకంగా తప్పులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, మండల వ్యవసాయ అధికారి, తహశీల్దార్, సచివాలయ వ్యవసాయ సహాయకులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …