గోపాలపురం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల ద్వారకా తిరుమల మండలం జీ. కొత్తపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తూ సాంబారు గిన్నెలో పడి గాయపడిన గొల్లపల్లి అన్విక కి వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని గోపాలపురం శాసన సభ్యులు తలారి వెంకట్రావు బుదవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. గొల్లపల్లి అన్వికా (5సంవత్సరాలు) జూన్ 5, ఆదివారం ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సాంబార్ డేగిషా లో పడి తల మినహాయించి గెడ్డం నుంచి కిందిభాగం అంతా సెగలు కక్కే సాంబార్లో మునిగి పోయింది. వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కి తీసుకెళ్తే విజయవాడ రెయిన్ బో ఆసుపత్రి కి సిఫార్సు చేశారు. అక్కడ జాయిన్ చేసుకుని ఐ సి యూ లో ఉంచి చికిత్స అందజేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని స్పందించిన గోపాలపురం శాసన సభ్యులు తలారి వెంకట్రావు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం కోరుతూ లేఖ వ్రాయడం జరిగింది. ఈ ఘటనకు స్పందించిన విజయవాడ రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూన్న అన్విక వైద్య చికిత్స నిమిత్తం రూ.10 లక్షలు లెటర్ ఆఫ్ క్రెడిట్ ను జారీ చేస్తూ ముఖ్యమంత్రి స్పెషల్ సెక్రెటరీ డా. ఎమ్. హరికృష్ణ ఆసుపత్రి యాజమాన్యానికి బుధవారం లేఖ పంపడం జరిగిందని శాసన సభ్యులు తలారి వెంకట్రావు తెలిపారు. గొల్లపల్లి అన్విక కుటుంబ సభ్యులు తరపున ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియ చెయ్యడం జరిగిందని ఆయన తెలిపారు.
Tags rajamendri
Check Also
సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి
-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …