-అధికార మదంతో బీజేపీ కి పిచ్చి పట్టింది
-రియాక్షన్… రిప్లెక్షన్…చూపిస్తాం
-గాంధేయ మార్గంలో ప్రయాణించే కాంగ్రెస్ పార్టీని రెచ్చ్చగొట్టద్దు
-ఏఐసీసీ కార్యాలయం పై దాడి చేసి కొడతారా?
-నాగపూర్ ఆఫీస్ లో సోదాలు చేయాలి
-నేడు రాజ్ భవన్ ముందు కాంగ్రెస్ శాంతియుత నిరసన
-ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికార మదంతో బీజేపీ కి పిచ్చి పట్టిందని, భారత రాజ్యాంగం ..ప్రజాస్వామ్యం పై ఏమాత్రం గౌరవం లేని బీజేపీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ రియాక్షన్… రిప్లెక్షన్ చూపిస్తామని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ హెచ్చరించారు. రాజ్యాంగ వ్యవస్థలను చెప్పు చేతల్లో పెట్టుకుని అవహేళన చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా గురువారం రాజ్ భవన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ అడుగు మీ పతనానికి నాంది అని గుర్తు పెట్టుకోవాలని, గాంధేయ మార్గంలో ప్రయాణించే కాంగ్రెస్ పార్టీని రెచ్చ్చగొట్టద్దని అన్నారు. బుధవారం విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
నేషనల్ హెరాల్ట్ దినపత్రికకు సంబంధించిన కేసులో రాహుల్ గాంధీని విచారణ పేరుతో ఈడీ వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని డాక్టర్ సాకే శైలజనాధ్ పేర్కొన్నారు. ఇందుకు నిరసనగా గురువారం రాజభవన్ ముందు గాంధేయవాదంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే బీజేపీ ఉనికి ప్రమాదంలో పడుతుందనే భయం పట్టుకుందని, ప్రశ్నించే గొంతుకలను బీజేపీ అణచి వేసే ప్రయత్నం చేస్తోందన్నారు. బేషరతుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం బీజేపీ చేసే చర్యలకు రేపు ప్రతిచర్యలు ఉంటాయని శైలజనాథ్ హెచ్చరించారు.
పెరిగిన ధరలతో ప్రజా ఆకలికి, రైతుల చావులకు రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పై ఎఫ్ ఐ ఆర్ లేకుండా ఈడీ కేసులు నమోదు చేసి విచారణ జరపడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. నేషనల్ హెరాల్డ్ బీజేపీ దా ..ఆర్ ఎస్ ఎస్ దా.. కాంగ్రెస్ పార్టీ ది … దొంగ లెక్కలు లేవు.. అప్పు ఇచ్చింది.. మీ ప్రభుత్వం పై అనుమానాలు ఉన్నాయి. రఫెల్ నుంచి రూ. 2000 నోట్లు ఎన్ని ముద్రించారో బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేయ గలదా అని శైలజనాథ్ ప్రశ్నించారు. బీజేపీ రాజకీయ విధానాన్ని ప్రజలు అసహ్యించుకుంటు న్నారని అన్నారు. తక్షణమే ఈడీ కేసులు వెనక్కు తీసుకుని బే షరతుగా క్షమాపణలు చెప్పాలని శైలజనాథ్ డిమాండ్ చేశారు.