-వరుసగా మూడు రోజు ఈడీ విచారణ జరిపిన విధానం అనుమాస్పదంగా వుంది
-ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లోని కృష్ణా హోటల్ సెంటర్ నందు గల తన కార్యాలయం వద్ద బుధవారం ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వేముల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టరేట్ (ఈడీ) తీరు చూస్తుంటే మోడీ కనుసైగల్లో నడుస్తుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదన్నారు. భారత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జాతీయ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకీ వెళ్ళి మరీ అరెస్టులు చేయడం దేశ రాజకీయాలు ఏ పరిస్థితుల్లో ఉందో ఇంకా ఎలాంటి అనివార్య దుర్ఘటనలకు దారితీస్తుందో అనీ విచారణ వ్యక్తం చేస్తూ.. నాటి బ్రిటీష్ ప్రభుత్వ పాలనలో ఏ నాడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి చొరబడిన సందర్భాలు లేవని.. ఆనాడు బ్రిటీష్ పాలకులను దేశం నుండి తరిమి కొట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదనీ, మతోన్మాద పార్టీ బిజెపిను గద్దెదించడం అంత కష్టమేం కాదనీ జాతీయ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్.ఎస్.యు.ఐ.) ఆంధ్రప్రదేశ్ తరపున హెచ్చరించడమైనదన్నారు.