అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 18 న జరుగనున్న భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబందించిన ఎన్నికల సామాగ్రి పటిష్టమైన భద్రత నడుమ మంగళవారం అర్థరాత్రి రాష్ట్ర శాసన సభ భవనానికి సుక్షితంగా చేరాయి. వెలగపూడి రాష్ట్ర శాసన సభ ప్రాంగణంలో నిరంతర పోలీస్ పహారా మధ్య ఈ ఎన్నికల సామాగ్రిని అధికారులు సురక్షితంగా భద్రపర్చారు. భారత ఎన్నికల సంఘం అధికారుల ఆదేశాల మేరకు డిల్లీలోని నిర్వచన్ సదన్ నుండి ఈ ఎన్నికల సామాగ్రిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం సహాయ ప్రధాన ఎన్నికల అధికారి జె.వి.శ్రీనివాస శాస్త్రి, ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి కె.రాజకుమార్, ఇతర సిబ్బందిని రాష్ట్ర అధికారులు డిల్లీకి పంపారు. వీరు భారత ఎన్నికల సంఘం నుండి ఈ ఎన్నికల సామాగ్రిని తీసుకుని ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం రాత్రి గన్నవరం విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ చీఫ్ మార్షల్ థియో ఫిలాస్ నేతృత్వంలో పటిష్టమైన పోలీస్ భద్రత మధ్య గన్నవరం విమానాశ్రయం నుండి వెలగపూడిలోని రాష్ట్ర శాస సభా భవనానికి ఈ ఎన్నికల సామాగ్రిని అధికారులు సురక్షితంగా చేర్చి శానిటైజ్ చేసి భద్రపర్చారు.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …