Breaking News

అభిమాని కోరిక తీర్చిన చిరంజీవి…

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రదర్శించే ఆపేక్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, తన సొంతూరు మొగల్తూరుకు చెందిన ఓ అభిమాని చివరికోర్కె తీర్చారు. ఆ అభిమాని పేరు నాగరాజు. నాగరాజుకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. తన చివరికోర్కెగా తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని కలవాలనుందని మనసులో మాట వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి నాగరాజును తన నివాసానికి ఆహ్వానించారు. మృత్యువుతో పోరాడుతున్న తన వీరాభిమానిని చూసి చలించిపోయారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నాగరాజును పరామర్శించారు. దాదాపు గంటపాటు ఆ అభిమానితో ముచ్చటించారు. అతడిలో మానసిక స్థైర్యం కలిగించడమే కాదు, ఆర్థికసాయం కూడా అందించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యల్.బి.ఆర్.సి.ఈ లో ఐదవ రోజు అంతర్-రాష్ట్ర యువజన మార్పిడి కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుచున్న, మై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *