-కన్నుల పండుగగా వీక్షించిన భక్తులు
-మహా అన్నదాన కార్యక్రమం
ఖమ్మం నేటి పత్రిక ప్రజావార్త :
శ్రావణ మాసం రెండోవ మంగళవారం పురస్కరించుకుని కాల్వొడ్డు మున్నేరు ప్రాంతంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానంలో ఎల్లమ్మ – జగద్ అగ్ని మునిరాజుల కళ్యాణాని ఆలయ పూజారి ఉప్పిసాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గత పది సంవత్సరాల నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట, నల్లగొండ, విజయవాడ, ఇల్లందు చుట్టూ పక్కాల తీరుప్రాంతాల నుండి ప్రజలు పాల్గొని కన్నుల పండుగగా తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఉదయం తొమ్మిది గంటలకు నల్గుగు ఆ తర్వాత ఎదుర్కోలు, ఒడిబియ్యం బోనాలు సమర్పించారని అన్నారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా 47వ డివిజన్ కార్పొరేటర్ మాటేటి అరుణ నాగేశ్వరరావు తెరాస యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాటేటి కిరణ్ కుమార్, నాయకులూ మాటేటి రవి పాల్గొన్నారు. ఈ కల్యాణంలో ఎల్లమ్మ అమ్మవారి (అమ్మాయి) తరపున పీఠలమీద చౌడవరపు నాగేశ్వరరావు – అరుణకుమారి దంపతులు, జగద్ అగ్ని మునిరాజు స్వామివారి ( అబ్బాయి ) తరపున పమిడీ మర్రి కృష్ణ మోహన్ – కృష్ణ కుమారి దంపతులు కూర్చుని వివాహం జరిపించారని పేర్కొన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలు కాకరపర్తి వినయ్ కుమార్ – స్వాతి దంపతులు. దాదాపు ఐదు వందల మంది భక్తులు పాల్గొని విజయవంతం చేశారు. సైదులు, యాదగిరి, ఝాన్సీ, రాజమ్మ, సుభద్రమ్మ, కుమారి తదితరులు ఉన్నారు.