హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లేక్ వ్యూ గెస్ట్ హౌస్, ఏపి సిఎం క్యాంప్ కార్యాలయంలో జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, పరిశ్రమలు వాణిజ్య సలహాదారు లంకా శ్రీధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు వారు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పథకాలు అమలు జరుగుతున్న తీరు అభినందనీయం అని అన్నారు. మీడియా కో ఆర్డినేటర్ బి ఎస్ రామకృష్ణ, సీనియర్ పాత్రికేయులు జాగర్లమూడి రామకృష్ణ, వై. సుధాకర్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు అధికారులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News