రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ క్రాప్, రెవెన్యూ అజామాషి , రీ సర్వే, హౌసింగ్, ఓటర్ కార్డు ఆధార్ అనుసంధానం, నీటితీరువా, మ్యుటేషన్, మిల్క్ యూనిట్స్, ప్రాధాన్యత భవనాలు, ఈ కే వై సీ, తదితర పది అంశాలపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో ఈ క్రాప్ నమోదు లో బాగంగా వ్యవసాయ సాగు విస్తీర్ణం లో 88,452 ఎకరాలు (43 శాతం), హార్టికల్చర్ విస్తీర్ణం లో 57,060 ఎకరాలు (33 శాతం) మాత్రమే పూర్తి చేసి యున్నరన్నరు. జిల్లాలో వాస్తవికంగా సాగు ఉన్న ప్రతి ఎకరా ఈ క్రాప్ తప్పని సరిగా చేయాలన్నారు. నిన్నటి రోజున ఇచ్చిన లక్ష్యం లో 99.99 శాతం పూర్తి చేసిన సగటు లక్ష్యాలు మాత్రం ఆశాజనకంగా లేదన్నారు. ఇకపై గ్రామ వ్యవసాయ, గ్రామ హార్టికల్చర్ సిబ్బంది డేటా ఎంట్రీ పనులు పూర్తి చేసేందుకు ఆదివారం కూడా పనిచేయాలని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. పని తీరు బాగాలేని వి ఏ ఓ, వి హెచ్ ఓ లకు షో కాజ్ నోటీస్ జారీ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
హౌసింగ్ పై సమీక్ష చేస్తూ, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అదనపు అధిక రుణం ఇప్పించాలని, అదే విధంగా ఎస్ హెచ్ జి పరిధిలో లేని వారిని గ్రూప్ గా ఏర్పాటు చేసి బ్యాంకర్ల ద్వారా ఇంటి నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 600 లకు పైగా సచివాలయం పరిధిలో ఇంజనీరింగ్ సహాయకులు ఉన్నారన్నారు. వారికి లక్ష్యాలను సాధించడానికి అనువుగా లక్ష్యాలను ఇవ్వాలని తెలిపారు. బేస్ మెంట్ స్థాయి లో 10,450 గృహాలు ఉన్నాయని తెలిపారు. గతవారం ఈ వారంలో లక్ష్యాలను సాధిస్తామని క్షేత్ర స్థాయి అధికారులు చెప్పిన 2600 లక్ష్యాలకు గాను 350 మాత్రమే స్టేజ్ కన్వర్షన్ చేశారని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. మీరు సాధిస్తామని తెలిపిన వాటిని కూడా ఎందుకు సాధించలేక పోయారని ప్రశ్నించారు. కలెక్టర్ మాట్లాడుతూ, 25 డిసెంబర్ 2020న ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం స్థలాలు మంజూరు చేసిందని, ఈ ఏడాది డిసెంబర్ 25 న ఆయా ఇండ్ల నిర్మాణం పూర్తి చేసిన విషయం పై ప్రభుత్వ ప్రకటన జారీ చేస్తున్న దృష్ట్యా ఆనాటికి పురోగతిలో ఉన్నవి పూర్తి చేయాలన్నారు. స్టేజ్ కన్వర్షన్ కి ఉన్న కొద్ది పాటి లక్ష్యాలు పూర్తి చెయ్యడం కోసం మరింత నిబద్దత అవసరం ఉందన్నారు. ఎన్ పి ఏ, ప్రాధాన్యత భవనాలు నిర్మాణాలకు ఇసుక సరఫరా ఇబ్బంది ఉంటే ఆర్డీవో లకు తెలిపి సమస్య పరిష్కారం చేసుకోవాలని సూచించారు.
ఈ క్రాప్ కు సంబందించి వ్యవసాయ భూములు 43 శాతం, హార్టికల్చర్ లో 33 శాతం మాత్రమే ఈ కే వై సీ పూర్తి చేశారని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. గ్రామంలోని వ్యవసాయ, రెవెన్యూ కార్యదర్శి ప్రతి ఒక్క రైతు, భూమి వివరాలు ఈ కేవైసి చేయాలన్నారు. అగ్రి కల్చర్ సహాయకుడు లాగిన్, ఓ టి పి విధానం ద్వారా పూర్తి చెయ్యాలని ఆదేశించారు. రానున్న మూడు రోజుల సమయంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. కొన్ని మండలాలు పనుల్లో పురోగతి సాధించకపోతున్నా , మెరుగైన పనితీరు చూపుతున్న తాళ్లపూడి, అనపర్తి, రాజమండ్రి రూరల్ మండల వ్యవసాయ అధికారులను జేసీ అభినందించారు.
జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ మాట్లాడుతూ, జిల్లాలో భూముల రెవెన్యూ అజామషి కి సంబందించిన 4,22,470 సర్వే నంబర్ లలోని 6,06,988 ఎకరాలు చెయ్యవలసి ఉండగా ఇప్పటి వరకు 1,55,768 సర్వే నంబర్ లలోని 1,99,273 ఎకరాలు పూర్తి చేసి ఉన్నారని తెలిపారు. ఇంకా 4,07,715 ఎకరాలు 63 శాతం పూర్తి చెయ్యావలసి ఉందన్నారు.
ఇందుకోసం ఆర్డీవోలు ప్రతి రోజు ఒక మండలం కి చెందిన సంబందించిన అధికారులను, సిబ్బందిని పూర్తి డేటా తో సమీక్ష చేసి వారం రోజుల లో రెవెన్యూ అజామషి లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో ఆర్డీవో లదే పూర్తి బాధ్యత అన్నారు. ఇంటి నిర్మాణాల స్టేజ్ కన్వర్షన్ మరింత పెరిగే లా చర్యలు తీసుకోవాలని కోరారు. సెంటరింగ్ పనులు పూర్తి అయిన ఇళ్లు పూర్తి చేయాలన్నారు.
ఆధార్ నంబర్ ఓటరు కార్డు అనుసంధానం చేయడం లో 23 శాతం చెయ్యడం జరిగిందని, ఈ ప్రక్రియ ను మరింత వేగం చెయ్యాలని జాయింట్ కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. జిల్లాలో 15,39,397 ఓటర్లకు గాను, 3,53,732 మంది డేటా ఎంట్రీ పూర్తి చేశారని, మిగిలిన లక్ష్యాలు రోజుకు ప్రతి బిఎల్ఓ కనీసం 10 నుంచి 20 డేటా సేకరణ చేసి, డేటా ఎంట్రీ పూర్తి చెయ్యాలని ఆదేశించారు. సంబంధించిన శాఖల అధికారులు ఈ సమావేశానికి జిల్లా కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు.