Breaking News

అక్టోబర్ 2 న భూ హక్కు పత్రాలు పంపిణీకి సిద్దం కావాలి : జిల్లా కలెక్టర్

-స్పందన వినతులు నిర్ణీత సమయం లోపు పరిష్కరించాలి…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
జిల్లాలో స్పందన వినతులకు సంబంధించి పరిష్కారం నాణ్యతగా నిర్ణీత సమయం లోపు చేసి, పరిష్కార అనంతరం సంబంధిత అధికారి అర్జీదారునితో కలిసిన సేల్ఫీ ఫోటో స్పందన పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అధికారులను ఆదేశించారు.

గురువారం ఉదయం అమరావతి నుండి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి సమీర్ శర్మ అన్నిజిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, జేసి డి కే బాలాజీ సంబందిత అధికారులతో హాజరయ్యారు. అనంతంరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై స్పందన వినతులను ఆమోదించినప్పుడు అర్జీదారునికి మెసేజ్ అందేలా స్పందన పోర్టల్ లో సదుపాయం ఏర్పాటు చేయబడినదని ఆర్జీలను సకాలంలో పరిష్కరించి బియాండ్ ఎస్.ఎల్.ఏ కి వెళ్ళకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. గడప గడప కు మన ప్రభుత్వంకి సంబంధించిన పూర్తి స్థాయి అంచనాలు, ప్రతిపాదనలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడానికి పోర్టల్ లో ఆన్లైన్లో పూర్తి స్థాయిలో చేయాలని తెలిపారు. జిల్లాలో నేటి వరకు 367 పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు 112 పనులకు పరిపాలన అనుమతులు ఇచ్చామని వాటి నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది పెండింగ్ ప్రోబేషన్ డిక్లరేషన్ ల ప్రతిపాదనలు ఉంటే పూర్తి చేయాలని సంబంధిత DDO లు PRAN నంబర్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్న తోడు ఆరవ విడత డిసెంబర్ లో ఉంటుందనీ తెలిపారు. నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో స్టేజి కన్వర్షన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని తెలిపారు. ఇంకా ప్రారంభం కాని, పునాది స్థాయి కన్నా కింద ఉన్న ఇళ్ళ మీద ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంటి నిర్మాణాలకు SHG లోన్లు 35000 సకాలంలో అందించాలని, వాటిలో ఎలక్ట్రిసిటీ మరియు డ్రైనేజ్, వాటర్ సప్లై తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఆప్షన్ 3 కింద ఉన్న ఇళ్లకు పెద్ద లేఅవుట్ లకు కాంట్రాక్టర్ లతో త్వరిత గతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అర్హత కలిగిన మిగిలిపోయిన లబ్ది దారులకు కొత్త ఇళ్ల మంజూరు కొరకు లబ్దిదారుల వివరాలను అక్టోబర్ లోపు ఆన్లైన్లో అప్లోడ్ చేయమని తెలిపారు. గోడలు, మిద్దె పడిన ఇళ్లను పూర్తి చేసి డిసెంబర్ నాటికి మెగా గృహ ప్రవేశాలకు సత్వర చర్యలు చేపట్టాలని తెలిపారు. సచివాలయం సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ రోజువారీగా మూడుసార్లు, వాలంటీర్లు వారంలో మూడు సార్లు బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని దీనిపై సంబంధిత ఎంపీడీఓ లు, మునిసిపల్ కమిషనర్ లు, ఆర్డీఓ లు సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.

గ్రౌండ్ సర్వే మరియు గ్రౌండ్ ట్రూతింగ్ ను వేగవంతం చేసి సెక్షన్ 13 పబ్లికేషన్ డ్రాఫ్ట్ ఆర్ ఓ ఆర్ సిద్ధం చేసి, అక్టోబర్ 2 నాటికి ఫైనల్ ఆర్ ఓ ఆర్ పూర్తి చేయాలని కోరారు. 64 గ్రామాలకు సాధ్యమైనంత వరకు పూర్తయ్యేలా కేటగిరీ 1 & 2 హక్కు పత్రాలు అందించుటకు, వివిధ రకాల రికార్డ్స్ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు, హౌసింగ్ ప్రత్యేక అధికారి రామచంద్రా రెడ్డి, హౌసింగ్ పిడి, జిల్లా ప్లానింగ్ మరియు స్టాటిస్టికల్ అశోక్ కుమార్, ఏడి సర్వే జయరాజు, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ గ్రామ వార్డు సచివాలయలు జగదీష్, డి ఎల్ డి ఓ సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *