విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న అర్బన్ స్ట్రీట్ ఆర్ట్ పోటీలలో యువ డిజైనర్లు తమ నైపుణ్యాన్ని సమగ్ర విధానంలో ప్రదర్శించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. రాష్ట్ర మరియు నగర ఔనత్యాన్ని చాటే విధంగా అద్భుతమైన రూపకల్పన చేయగలిన వారిని ఆహ్వానిస్తుంది. నగరాన్ని సుందరీకరించే ఈ పోటీలో రిజిస్టర్ చేసేటప్పుడు అనుసరించాల్సిన కొన్ని మార్గదర్శక సూత్రాలను వీఏంసి వారి వెబ్సైట్ లో పొందుపరిచారు. ఎవరైనా పోటీలో పాల్గొనడానికి అవకాశాన్ని కల్పించారు. ఇది ఐకానిక్ ఆర్ట్ ఇలస్ట్రేషన్‌ల యొక్క సంభావిత నిర్మాణ మరియు నిర్మాణ రూపకల్పన కోసం క్రౌడ్-సోర్స్ అమలు చేయగల ఆలోచనల కోసం నిర్వహించబడిన పోటీ. ఎంపికైన ప్రతి డిజైన్ కు రూ. 50,000/- బహుమతి గా నియమించారు. రాష్ట్రం యొక్క గొప్ప చారిత్రక మరియు సాంస్కృతిక వారసత్వాన్ని చిత్రీకరించడానికి మరియు భిన్నత్వంలో ఏకత్వాన్ని మరియు అభివృద్ధి చెందుతున్న నూతన ఆంధ్రప్రదేశ్ ఆకాంక్షలకు ప్రతీకగా నిలవడానికి అవకాశం ఉన్న వేదికలో తమ ప్రతిభను చాటడానికి వీఏంసీ ఆహ్వానిస్తుంది. రిజిస్ట్రేషన్‌లు ఆన్‌లైన్‌లో పూర్తి చేసి, వారి డిజైన్ డ్రాయింగ్‌లను సమర్పించాల్సి ఉంటుంది . డిజైన్ కాంపిటీషన్ బ్రీఫ్‌ని OUR VMC వెబ్సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అర్బన్ స్ట్రీట్ ఆర్ట్ పోటీలకు సంబందించి వివరాలు తెలుసుకోవడానికి ఈ నెంబర్ కు ఫోన్ చెయ్యగలరు. Ph.No.9039024000 (డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్)
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …