విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
సీనియర్ జర్నలిస్ట్ అంకబాబుకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడం అమానుషమైన చర్యగా పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం రాత్రి సీఐడీ పోలీసులు అక్రమంగా సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఎపియుడబ్ల్యుజే విజయవాడ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐజేయూ కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, ఎపియుడబ్ల్యుజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచల జయరాజ్, అర్బన్ అధ్యక్షుడు చావా రవి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు యు. వెంకట్రావు, సీనియర్ పాత్రికేయులు కృష్ణాజీ, బాల కోటయ్య తదితరులు మాట్లాడుతూ జర్నలిస్ట్ గ్రూప్స్ లో వచ్చిన సమాచారాన్ని మరోగ్రూపులో చేరవేయడం తప్పా? అని ప్రశ్నించారు. పోలీసులు ఎవరినైనా విచారించే సమయంలో 41 నోటీసులు ఇవ్వాల్సి ఉండగా సీఐడీ పోలీసులు అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఆరోపించారు. ఎందుకు పోలీసులు 41 నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంకబాబు అరోగ్య అందోళన కరంగా ఉన్నందున ఆయనను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేడు ఆయన అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు అందోళన చేస్తున్నట్లు తెలిపారు. అంకబాబు పోలీసులు వేంటనే విడుదల చేయకపోతే ఆందోళన ఉధృతం చేసేందుకు కార్యచరణ రూపొందించనున్నట్లు నేతలు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వర రావు, దాసరి నాగరాజు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆర్. వసంత్, యూనియన్ నేతలు మోదుమూడి మురళీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …