తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు క్లాత్‌పై కాఫీ పౌడర్‌తో వేంకటేశ్వరస్వామి చిత్రాన్ని వేసిన తిరుమల యువకుడి పేరు వండర్ బుక్ ఆఫ్ రికార్స్ట్‌లో నమోదయింది. తిరుమలకు చెందిన పల్లి చిరంజీవి మైక్రో ఆర్టిస్ట్. బియ్యపు, చింతగింజలపై జాతీయ పతాకం, జాతీయ నేతలు, శ్రీవారు, అమ్మవార్ల బొమ్మలు వేసి పేరు పొందాడు. ఈ నెల 27నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు మురంశెట్టి రాములు సూచన మేరకు 50 అడుగుల క్లాత్‌పై కాఫీ పౌడర్‌తో శ్రీవారి చిత్రాన్ని గీశాడు. తిరుపతిలోని ఆర్య నివా్‌సలో 20 రోజుల పాటు ఈ చిత్రాన్ని వేశాడు. ఏడు కొండలకు సూచికగా ఏడు కేజీల కాఫీ పౌడర్‌ను వినియోగించాడు. స్వామి ఆశీస్సులతోనే ఈ భారీ చిత్రాన్ని గోవిందనామాలు స్మరించుకుంటూ వేశానని చిరంజీవి తెలిపారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …