తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త:
సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు జిల్లాలో అనుకూల వాతావరణం ఉన్న విషయాన్ని విస్తృత ప్రచ్చారం కల్పించాలని జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాస రావు అన్నారు. శనివారం మద్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డి.ఐ.ఈ.పి.సి) జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డి.ఆర్.ఓ. సమీక్ష నిర్వహించారు. జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ ఎం.ఎస్.ఎం.ఈ ల ఏర్పాటుకు మండల స్థాయి లో జరిగే సమావేశాలలో పరిశ్రమల ప్రాధాన్యతల పై అవగాహన కల్పించాలని అన్నారు. ప్రధానంగా బ్యాంకర్ లు ఎప్పటికప్పుడు ఎం.ఎస్.ఎం.ఈ ల రిజిస్ట్రేషన్ అయిన వాటికి ప్రత్యేక ప్రోత్సాహకం ఇవ్వాలని సూచించారు. సింగల్ డెస్క్ విదానంలో జిల్లా ఏర్పడిన నాటి నుండి 293 పరిశ్రమలకు గాను 270 అనుమతులు ఇచ్చామని మరో 20 పరిశీలనలో ఉన్నాయని రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన మేరకు 67 పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రూ.3.37 కోట్లు అందించడానికి నేడు ఆమోదం తెలిపామని అన్నారు. పెట్టుబడి సబ్సిడీ 35, విద్యుత్ సబ్సిడీ 14, వడ్డీ రాయితీ 13, ఎస్.జియస్టీ 2, స్టాంప్ డ్యూటీ 2, ల్యాండ్ కన్వేర్షన్ ఒక పరిశ్రమలు ఇందులో ఉన్నాయని అన్నారు. పి.డి.పి ప్రోగ్రాం క్రింద శ్రీకాళహస్తి, గుంటకిందపల్లి వద్ద కళంకారీ హ్యాండీ క్రాఫ్ట్స్ క్లస్టర్, తిరుమణ్యం వద్ద ప్రింటింగ్ క్లస్టర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని అన్నారు. తిరుపతి జిల్లా నుంచి పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులు దాదాపు రూ.5593 కోట్లుగా ఉందని వివరించారు. జిల్లాలో పరిశ్రమల ప్రమాదాల నివారణకు కమిటీ చర్యలు చేపట్టిందని, తరచూ తప్పనిసరి సంబందిత అధికారులు సేఫ్టీ మెజర్మెంట్ పై అవగాహన కల్పించి తప్పనిసరి అమలు చేసేలా చూడాలని ఆదేశించారు. పరిశ్రమలకు కావలసిన నీటి సౌకర్యాల కల్పన పై సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి ప్రతాప్ రెడ్డి, జోనల్ మేనేజర్ ఏపిఐఐసి చంద్రశేఖర్ , లీడ్ బ్యాంకు మేనేజర్ సుభాష్, పారిశ్రామిక వేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …