-ఈ వ్యాధి పశువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందదు…
-“08832948688” నెంబర్ తో కంట్రోల్ రూమ్
– డాక్టర్ ఎస్ టి జి సత్య గోవింద్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
కాప్రిపాక్స్ వైరస్ ద్వారా “లంపిస్కిన్ ముద్ద చర్మ వ్యాధి ఆవులలో, గేదెలలో వ్యాప్తి చెందుతుందని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఎస్ టి జి సత్య గోవింద్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
పాక్సివిరిడే కుటుంబానికి చెందిన మశూచి కలుగచేసే వైరస్ దోమలు ,తుండి ఈగలు ద్వారా పశువుల్లో పిడుదుల, గోమార్ల ద్వారా ఒక పశువు నుండి వేరొక పశువుకు వ్యాపిస్తుందన్నారు.ఈ వ్యాధి కలిగిన పశువు నుండి రక్తం పీల్చే దోమలు ,ఈగలు ఆరోగ్యవంతమైన పశువుని కుట్టుట ద్వారా వ్యాప్తి చెందుతుందన్నారు. ఈ వైరస్ బారిన పడిన పశువులలో లింప్స్ గ్రంధులను ఆశ్రయించి, గ్రంధులు వాచి గుండ్రంటి బూడిపెల మాదిరి, 2 నుండి 5 సెంటీమీటర్లు పరిమాణం కలిగి ఉంటాయన్నారు. వ్యాధి సోకిన పశువు కు 41 నుండి 44 సెంటీగ్రేట్ వరకు జ్వరం, ముక్కు, కళ్ళ నుండి నీరు, పశువు నీరసించి ఆహారం తినలేవు, . పాలు దిగుబడి తగ్గిపోతుంది. వ్యాధి లక్షణాలు కనిపించడానికి 4 నుండి 28 రోజులు కూడా పట్టవచ్చు అన్నారు. వ్యాధి సోకిన పసుపును మంద నుండి వేరుచేసి దూరంగా ఉంచి వైద్యం అందించాలి. ఈ వ్యాధి తీవ్రతను బట్టి 5 నుండి 15% మరణాలు సంభవించవచ్చు అన్నారు. ,పశువులలో పునరుత్బుత్తి శక్తి తగ్గిపోవడం, సామర్ధ్యాన్ని కోల్పోతాయి. చర్మం వ్యాపారస్తులకు ఆర్థిక నష్టం ఏర్పడుతుంది.పశు ఉత్పత్తుల ద్వారా వచ్చే విదేశీ మారక ద్రవ్యం భారీగా నష్ట పోవాల్సి వస్తుంది . లేగ దూడలు ఎక్కువగా మరణిస్తాయన్నారు. ఈ వ్యాధి సోకకుండా గోట్ పాక్స్ టీకాలను ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. గోపాలమిత్రాలు, పేరా వెటర్నరీ సిబ్బంది, పశువైద్యాధి కారుల పర్యవేక్షణలో తప్పనిసరిగా టీకాలు వేయించాలన్నారు. పశువుల కొట్టాలలో ఈగలు, దోమలు ,గోమార్లు, పిడుదులు లేకుండా చూస్తూ, సోడియం హైపో క్లోరేట్ ద్రావణంతో గానీ 0.5% ఫార్మలిన్ తో గాని పిచికారి చేసి శుభ్రపరుచుకోవాలి. “బ్యూటాక్స్” టీకా లేదా టిక్కిల్ లాంటి మందులు వాడి పశువులపై స్ప్రే చేయాలి . లేదా ఐవర్ మెక్టిన్ వాడాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నివారణ చర్యలు తీసుకుంటు న్నామన్నారు. పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మార్కెటింగ్ శాఖలతో పశుసంవర్ధక శాఖ సమన్వయ పరుచుకుని ఇతర రాష్ట్రాల నుంచి పశుసంపద దిగుమతి , ఎగుమతు లను నిషేధించామన్నారు. నూతనంగా పశువులు జిల్లాలోనికి రాకుండా జిల్లా సరిహద్దులలో చెక్ పోస్ట్ జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో”08832948688″ నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.
రైతుల్లో టీకాలు వేసినచో పశువులలో పాల దిగుబడి తగ్గుతుందని అపోహ మాత్రమే అన్నారు. 10 నుండి 20% మాత్రం పాల దిగుబడి తాత్కాలికంగా తగ్గినా, జ్వరం తగ్గిన తర్వాత పాల దిగుబడి మామూలుగా స్థాయికి వస్తుంది. చూడు పశువులకు కూడా టీకాలు వేయవచ్చు అన్నారు.
ఈ వ్యాధి మనుషులకు వ్యాపి చెందదని పేర్కొన్నారు. వ్యాధి సోకిన పశువుల పాలు పితికిన వారికి చేతులకు పుండ్లు ఏర్పడే అవకాశం ఉంది కావున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి సత్య గోవింద్ అన్నారు.