తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 పోలింగ్ కేంద్రాల ప్రదేశాలను మార్పు, 18 పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పునకు నిర్దేశించడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ చాంబర్ నందు గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశమై ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ – 2022, గ్రాడ్యూయేట్ మరియు టీచర్ల కు సంబంధించి ఓటర్ల నమోదు పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ – 2022 లో భాగంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 7 పోలింగ్ స్టేషన్లను భవనాల మరమ్మత్తులు, వినియోగంలో లేనందున అందుబాటులో ఉన్న మరో 7 పోలింగ్ కేంద్రాలను గుర్తించామని అందులో 173, 174, 175, 231, 232, 233, 244 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. గతంలో ఉన్న భవనాల పేర్లు మార్చడం వల్ల మరో 18 పోలింగ్ కేంద్రాలకు పేర్లను మార్పు చేయడం జరిగిందని తెలిపారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 14, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 4 పోలింగ్ కేంద్రాలకు గతంలో ఉన్న చోటే ఉంచుతూ పోలింగ్ కేంద్రాల పేర్లు మార్పు చేయడం జరిగిందని వివరించారు. ఉపాధ్యాయ, గ్రాడ్యూయేట్ ఎం.ఎల్.సి ల గడువు రానున్న మార్చి మాసం లో ముగియనున్న సందర్భంగా ఓటర్ల నమోదు కు షెడ్యుల్ జారీ అయిందని ఈ నెల ఒకటి నుండి నవంబర్ 07 వరకు దరఖాస్తులను స్వీకరించి డిసెంబర్ 30 న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారని వివరించారు. ceoandhra.nic.in వెబ్ సైట్ నందు కూడా ఆన్ లైన్ నమోదు ఉన్నదని ఫారం – 18, ఫారం – 19 లను ఎం.ఎల్.సి స్థానాలకు ఉపయోగించాల్సి ఉంటుందని సూచించారు. ఈ సమావేశంలో బహుజన సమాజ పార్టీ, భారతీయ జనతా పార్టీ, సి.పి.ఐ., సి.పి.ఐ – ఎం, తెలుగుదేశం, వై.ఎస్.ఆర్.సి.పి, జన సేన పార్టీల ప్రతినిధులు, ఈ.ఆర్.ఓ లు, ఎ.ఆర్.ఓ. లు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …